Paal Dabba: రాజ్‌తరుణ్ సినిమాలో.. తమిళ సెన్షేషన్ ‘పాల్ డబ్బా’
ABN, Publish Date - May 18 , 2025 | 11:51 AM
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెలుగు నటుడు రాజ్ తరుణ్ హీరోగా ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ (Vijay Milton) దర్శకత్వంలో తెలుగు నటుడు రాజ్ తరుణ్ (RajTarun) హీరోగా రఫ్ నోట్ ప్రొడక్షన్ నం.5గా ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఆసపక్తికరమైన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం తమిళనాట తన బ్యాండ్‌తో యువతను ఉర్రూతలూగిస్తూ సంచలనం సృష్టిస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ పాల్ డబ్బా (Paal Dabba) ఈ చిత్రంతో నటుడిగా అరంగ్రేటం చేస్తున్నాడు. ఈ మేరకు మూవీ యూనిట్ ఓ వీడియో ప్రకటన విడుదల చేసింది.
చెన్నై, తమిళనాడు నుంచి వచ్చిన అనీష్, తన మ్యూజిక్ బ్యాండ్ పాల్ డబ్బా పేరుతో మంచి గుర్తింపు పొందాడు. రాపర్, సింగర్, సాంగ్ రైటర్ మరియు కొరియోగ్రాఫర్‌గా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. 170CM, కాతు మేళ, సోషల్ మీడియాలో వైరల్ అయిన గలాట (ఆవేశం నుంచి) వంటి పాటలతో ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రపంచంలో అనీష్ తనదైన స్థానంతో పాటు విశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. చిన్నప్పటి నుంచి చల్లటి పాలను ఇష్టపడి తాగే అనీష్ తన పేరును పాల్ డబ్బాగా మార్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన నటనలోనూ అడుగు పెడుతూ ఓ కొత్త పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ: “పాల్ డబ్బా ఎనర్జీకి ఈ సినిమా స్పిరిట్‌కు బాగా సరిపోతుంది. ఆయన నిజ జీవితంలోని అంకితభావం నిజాయితీతో మా సినిమాలోని పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుంది'' అన్నారు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా, గోలీసోడా ఫ్రాంఛైజీ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఆ ఫ్రాంచైజీల మాదిరిగానే ఎంతో బోల్డ్‌గా, భావోద్వేగ పూరితంగా, యథార్థతకు దగ్గరగా ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియనున్నాయి.