Bun Butter Jam: తెలుగులోనూ.. థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న మ‌రో త‌మిళ హిట్ మూవీ! టీజ‌ర్ చూశారా

ABN , Publish Date - Jul 31 , 2025 | 09:11 PM

త‌మిళ బిగ్‌ బాస్‌ సీజన్ 5 విన్న‌ర్‌ రాజు జయమోహన్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన త‌మిళ చిత్రం ‘బన్‌ బట్టర్‌ జామ్‌’

Bun Butter Jam

త‌మిళ బిగ్‌ బాస్‌ సీజన్ 5 (BB Tamil Season 5) రియాల్టీ షో విన్న‌ర్‌ రాజు జయమోహన్ (Raju Jayamohan) హీరోగా పరిచయమవుతూ రూపొందిన త‌మిళ చిత్రం ‘బన్‌ బట్టర్‌ జామ్‌’ (Bun Butter Jam). ఆద్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిక‌క‌థానాయుక‌లుగా న‌టించ‌గా చార్లీ, శ‌ర‌ణ్య మోహ‌న్‌, దేవ వ‌ర్శిణికీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

రాఘవ్‌ మిర్థాత్ (Raghav Mirdath) దర్శకత్వం వ‌హించగా.. రెయిన్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై సురేష్‌ సుబ్రమణియన్‌ నిర్మించాడు. గ‌త వారం త‌మిళ‌నాడులో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని వీజ్ఞేశ్వ‌ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తెలుగులోనూ తీసుకు వస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తెలుగు టీజ‌ర్‌ను గురువారం రాత్రి టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ చూస్తుంటే .. మంచి ఫ్యామిలీ, కామెడీతో న‌వ్వులు పూయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్టులో థియేట‌ర్ల‌లోకి తీసుకు రానున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 09:11 PM