Devilan: 48 గంటల్లో.. సినిమా పూర్తి
ABN , Publish Date - May 30 , 2025 | 01:03 PM
తమిళ దర్శక నిర్మాతలు ‘డెవిలన్’ అనే పేరుతో ఒక చిత్రాన్ని కేవలం 48 గంటల్లో తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు.
‘డెవిలన్’ (Devilan) అనే పేరుతో ఒక చిత్రాన్ని కేవలం 48 గంటల్లో తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమా షూటింగ్ మే 29, గురువారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభించి 31వ తేదీ, శనివారం సాయంత్రం 3 గంటలకు పూర్తి చేయనున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసాన్ని తాము చేసేందుకు సిద్ధమైనట్టు చిత్ర దర్శకుడు బిగ్గీ అరుణ్ (Bigguy Arun), నిర్మాత, హీరో రాజ్‌కుమార్ (Rajkumar) వెల్లడించారు.
ఇటీవల చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్, అరుణ్ మాట్లాడుతూ, ‘నేటి కాలంలో చిత్రాన్ని నిర్మించడం కంటే దాన్ని వ్యాపారం చేసి, విడుదల చేయడం సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మా సినిమా షూటింగ్ కేవలం 48 గంటల్లో పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టడం ఒక పెద్ద సాహసంతో కూడుకున్న పని. తాము తలపెట్టిన పని విజయవంతంగా పూర్తి చేస్తే నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కుతుంది అని అన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే పలు కోణాల్లో పరిశోధన చేశామని, 48 గంటల్లో ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేయడం అసాధ్యం. అయినా సరే పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ఇందులో హీరోయిన్లుగా కార్తిక, ఇందిర నటిస్తుండగా, ఫెడ్రిక్, ఆనంది విజయకుమార్, బాలనటుడు డోరత్తి ఎస్‌జే గిరుదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలాఉంటే గతంలోనూ సినిమాల విషయంలో పలుమార్లు జరిగాయి. ప్రభుదేవ నటించినసుయంవరం అనే చిత్రాన్ని పది మందికి పైగా డైరెక్టర్లు, ఇతర టెక్సీషియన్లు పని చేసి కేవలం 23 గంటల 58 నిమిషాల్లో పూర్తి చేసి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. ఆపై ఇప్పుడు ఐఫోన్‌తోనూ, ఏఐతోనూ సినిమాలు చేస్తుండడం విశేషం.