Rajini VS Ranveer: జైలర్‌కే ఎసరుపెట్టిన దురంధర్..

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:55 PM

తమిళనాట ఈ నాటికీ టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ గా నిలచింది రజనీకాంత్ (Rajinikanth) '2.0' మూవీ. టోటల్ గా రోబో-2 మూవీ రిజల్ట్ డిజప్పాయింట్ చేసినా, ఇప్పటికీ ఆ చిత్రమే అత్యధిక వసూళ్ళు చూసిన సినిమాగా ఉండడం విశేషం

Rajini VS Ranveer

Rajini VS Ranveer: తమిళనాట ఈ నాటికీ టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ గా నిలచింది రజనీకాంత్ (Rajinikanth) '2.0' మూవీ. టోటల్ గా రోబో-2 మూవీ రిజల్ట్ డిజప్పాయింట్ చేసినా, ఇప్పటికీ ఆ చిత్రమే అత్యధిక వసూళ్ళు చూసిన సినిమాగా ఉండడం విశేషం! అందువల్లే తమిళంలో వెయ్యి కోట్లు చూసే సత్తా రజనీకాంత్ చిత్రాలకే ఉందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. ఇక ఈ యేడాది ఆగస్టు 14న రిలీజైన కూలీ మూవీపై అలాంటి అంచనాలే ఉన్నా, అది వెయ్యి కోట్లు చూడకపోగా, ఫ్లాప్ గా నిలచింది. అయితే రాబోయే యేడాది రజనీకాంత్ జైలర్-2 ను కూడా ఆగస్టు 14వ తేదీనే రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. జైలర్ మొదటిభాగం బంపర్ హిట్ గా నిలచింది. దాంతో జైలర్ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రజినీ అలా నడిచి వస్తున్నా కూడా తన మ్యూజిక్ తో ఎలివేషన్ గా మార్చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఇవన్నీ జైలర్ ని టాప్ రేంజ్ లో నిలబెట్టాయి.ఇక ఇప్పుడు జైలర్ సీక్వెల్ అంతకుమించి ఉండబోతుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మొదట జైలర్ 2 ని.. జూన్ 12న రిలీజ్ చేయాలని భావించారు. కానీ, కొన్ని రోజుల నుంచీ ఈ సినిమా ఆగస్టు 14న రానుందని వినిపిస్తోంది. అయితే అదే రోజున రణవీర్ సింగ్ దురంధర్ మూవీ సీక్వెల్ కూడా వస్తోందని టాక్ నడుస్తోంది. ఈ యేడాది రణవీర్ కు దురంధర్ మంచి విజయాన్నే అందించింది... దాంతో ఆ సినిమా సీక్వెల్ పైనా అంచనాలు నెలకొన్నాయి.

నిజానికి దురంధర్ చిత్రాన్ని వచ్చే యేడాది మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అదే రోజున యశ్ టాక్సిక్ కూడా విడుదల కానుంది. ఆ రీతిన రణవీర్, యశ్ మధ్య పోటీ అనివార్యం అని భావించారు ట్రేడ్ పండిట్స్. కానీ, ఇప్పుడు రణవీర్ దురంధర్-2 ను ఆగస్టు 14న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రజనీకాంత్ జైలర్ సీక్వెల్ కు రణవీర్ సింగ్ దురంధర్ సీక్వెల్ కు మధ్య పోటీ తప్పదు. ఇండస్ట్రీలో ఓ సీనియర్ స్టార్, ఓ యంగ్ స్టార్ సీక్వెల్స్ పోటీకి సిద్ధమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పెద్దిని పక్కకు నెట్టి దురంధర్ ఏకంగా జైలర్ కే ఎసరుపెట్టాడే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సౌత్ స్టార్ మూవీతో నార్త్ స్టార్ సినిమా ఏ తీరున ఢీ కొంటుందో చూడాలి.

Updated Date - Dec 16 , 2025 | 07:43 PM