Rajinikanth: రజనీకాంత్ హిమాలయాల యాత్ర.. మహావతార్ బాబాజీ గుహలో ధ్యానం
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:22 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఆధ్యాత్మిక యాత్రకు హిమాలయాలకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.
రెండు నెలల క్రితం కూలీ వంటి హిట్ చిత్రం అందించిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఇటీవల ఆధ్యాత్మిక యాత్రకు హిమాలయాలకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రిషికేశ్ వంటి ప్రసిద్ధ ఆలయాలను సైతం దర్శించుకున్న ఆయన తాజాగా మహావతార్ బాబాజీ గుహ (Mahavatar Babaji caves)ను సందర్శించారు. సన్నిహితులతో కలిసి స్వయంగా కొండలు, గుట్టలు,సెలయేర్లు దాటుతూ ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ కొంతసేపు గడిపారు, ధ్యానం చేశారు.
ఆపై తిరుగు ప్రయాణంలో పలువురు అభిమానులతో ఫొటోలు దిగి వారిని ఆనంద పరిచారు. చిరునవ్వుతో వారితో కాసేపు మాట్లాడారు. ఇందుకు సంబంధఙంచిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 75 ఏళ్లు వచ్చినా రజినీకాంత్ లోని ఎనర్జీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, ఇలాంటి యాత్రల ద్వారా ఆయన ఎన్నో రకాలుగా అభిమానులకు కూడా స్ఫూర్తిగా మారుతున్నారు. మీరూ ఆ ఫొటోలు, వీడియోలు చూసేయండి మరి.
ఈ వీడియోలు చూసిన వారంతా రజనీకాంత్ (Rajinikanth) గతంలో స్వయంగా నిర్మించి నటించిన బాబా సినిమాలోని రాజ్యమా, సన్యాసమా భోగమా లేక యోగమా జ్ఞానియా అజ్ఞానియా ఎవరురా ఇతడు ఎవరురా అంబరం దాటినా అతిశయం బాబా జాతకం అనే పాటను ప్లే చేస్తుండడం విశేషం.