Raj Tarun: విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాజ్‌తరుణ్
ABN , Publish Date - May 11 , 2025 | 12:51 PM
రాజ్‌తరుణ్ తమిళ పరిశ్రమలో కూడా అడుగుపెడుతున్నాడు. ఆదివారం రాజ్‌తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నూతన చిత్రం విశేషాలను ప్రకటించారు.
రాజ్‌తరుణ్ (Raj tarun) తమిళ పరిశ్రమలో కూడా అడుగుపెడుతున్నాడు. ఆదివారం రాజ్‌తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నూతన చిత్రం విశేషాలను ప్రకటించారు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా తమిళ, తెలుగు, భాషల్లో ద్విభాషా చిత్రంగా ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుంది. తమిళంలో టాప్ హీరోలు విజయ్, అజిత్ వంటి హీరోలు నటించిన చిత్రాలతో పాటు సుమారుగా నలభై మూడుకి పైగా సుప్రసిద్ధ చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేయడంతో పాటు విక్రమ్, విజయ్ ఆంటోని, శివరాజ్‌కుమార్‌లు నటించిన చిత్రాలతో పాటు గోలీసోడా, గోలీసోడా2, గోలీసోడా రైజింగ్, భైరాగి, కడుగు వంటి చిత్రాలతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న పాపులర్ సినిమాటోగ్రఫర్, దర్శకుడు విజయ్ మిల్టన్ (Vijay milton) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
రాజ్ తరుణ్‌ను కోలీవుడ్‌కు హీరోగా పరిచయం చేస్తున్నాడు. గోలీసోడా ఫ్రాంఛైజీలో భాగంగా రాజ్‌తరుణ్‌తో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నాడు. రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణం కానుంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ పూర్తిగా కొత్త అవతార్‌లో ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చే విధంగా పూర్తి వైవిధ్యమపాత్రలో కనిపిస్తాడని, న్యూ షేడ్ యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఓ విభిన్నమైన కథతో, స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లేతో ఉంటుందని, ఈ చిత్రంలో కోలీవుడ్‌లోకి రాజ్ తరుణ్ ఎంట్రీ ఎంతో గ్రాండ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.