PVR INOX; ఇక చిన్న పట్టణాల్లోనూ.. పీవీఆర్ ఇనాక్స్

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:58 PM

పీవీఆర్ ఇనాక్స్ తన మల్టీ స్క్రీన్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది.

PVRINOX

భారతదేశంలో అగ్రగామి మల్టీప్లెక్స్ చైన్ సంస్థ‌గా పేరుగాంచిన‌ పీవీఆర్ ఇనాక్స్ (PVR Inox) తన మల్టీ స్క్రీన్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. సంస్థ తాజాగా సంస్థ‌ ప్రకటించిన వివ‌రాల‌ ప్రకారం, వచ్చే రెండు సంవత్సరాల్లో కొత్తగా 200 స్క్రీన్లను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది అంతేగాక ఈ ప్రాజెక్ట్‌పై సంస్థ రూ. 400 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. అయితే.. ఈ స్క్రీన్ల విస్తరణలో భాగంగా దక్షిణ భారతదేశం అందులోనూ ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇటీవలే హైదరాబాద్‌లో 4 స్క్రీన్లు ప్రారంభించిన పీవీఆర్, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 100 స్క్రీన్లను ప్రారంభించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్, జూన్ నెల‌ల‌ మధ్య 20 స్క్రీన్లు ప్రారంభమవ‌గా హైదరాబాద్, బెంగుళూరు, హుబ్లీ వంటి నగరాల్లో 40 స్క్రీన్లు, మిగతా స్క్రీన్లను ముంబయి, ఢిల్లీ, లేహ్, గాంగ్టాక్ లాంటి నగరాల్లో త్వ‌ర‌లో ప్రారంభించనున్నారు.

pvrinox.jpg

ఇదిలాఉంటే.. పీవీఆర్ ఇనాక్స్ (PVR Inox) త‌న‌ ప్ర‌ణాళిల్లో భాగంగా చిన్న పట్టణాలకు ప్రత్యేక స్థానం కేటాయించ‌గా కొత్త స్క్రీన్లలో 20 శాతం చిన్న పట్టణాల్లో, 40 శాతం దక్షిణ భారత రాష్ట్రాల్లో ఏర్పాటు కార‌నుండ‌డం విశేషం. అంతేగాక 2026-27 నాటికి మరో 80 నుంచి 100 కొత్త స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం పీవీఆర్ తెలంగాణలో 114 స్క్రీన్లతో కొనసాగుతుండ‌గా ఈ ఏడాది లోగా నూత‌నంగా మరో 22 స్క్రీన్లు స్టార్ట్ కానున్నాయి. కాగా.. ఒక్కో స్క్రీన్ కు రూ.మూడున్న‌ర‌ కోట్ల వ‌ర‌కు ఖర్చు కానుంది.

Updated Date - Jul 07 , 2025 | 01:58 PM