LIK: ఈసారి దసరా, దీపావళి.. రెండు ప్రదీప్ రంగనాథన్‌వే
ABN, Publish Date - May 12 , 2025 | 02:30 PM
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ నటించిన లిక్ విడుదల తేదీని ప్రకటించారు.
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తాజాగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (DUDE). ప్రముఖ తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మిస్తోండగా కీర్తిస్వరన్ (Keerthiswaran) దర్వకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ సినిమా ప్రారంభం కాకముందే తన మూడవ చిత్రంగా నయన తార ప్రోడక్షన్ హౌజ్‌లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో లిక్ (LIK )అనే ఓ చిత్రం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కృతిషెట్టి (Krithi Shetty) కథానాయికగా చేస్తున్న ఈసినిమా షూటింగ్ అలస్యమైంది. ఈలోపే ప్రదీప్ డూడ్ చిత్రం ఓకే చేయడం చకచకా షూటింగ్ జరుగుతూనే రిలీజ్ డేట్ ప్రకటించడం కూడి జరిగి పోయింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్టేట్ వచ్చింది సెప్టెంబర్ 18న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన లిక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అయితే బ్యాక్ టు బ్యాక్ ఒక నెల తేడాతో ప్రదీప్ నెండు సినిమాలు లిక్ సెప్టెంబర్ 18న, డూడ్ ఆక్టోబర్17న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో కలిపి ఈ యేడు మూడు సినిమాల రిలీజుతో ప్రదీప్ కొత్త రికార్టు నెలకొల్పనున్నాడు.