Coolie: కూలీ నుంచి అందాల మోనిక వచ్చేసింది

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:50 PM

పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో కూలీ (Coolie) ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ.

Coolie

Coolie: పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో కూలీ (Coolie) ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆమీర్ ఖాన్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


ఇక కూలీ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మొదటి నుంచి కూడా కూలీపై అటు కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక అంచనాలకు తగ్గట్టే లోకేష్ సినిమాను ఓ రేంజ్ లో చెక్కుతున్నాడు. స్టార్ హీరోలందరిని కీలక పాత్రల్లో తీసుకోవడమే హైప్ క్రియేట్ చేసింది అంటే.. హాట్ బ్యూటీ పూజా హెగ్డేని స్పెషల్ సాంగ్ కోసం తీసుకొని మరింత హైప్ పెంచేశాడు. తాజాగా పూజా హెగ్డే నర్తించిన స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


మోనికా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రజినీ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోనికా సాంగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది. కొన్నిరోజులు ఈ సాంగ్ ఇండస్ట్రీని ఊపేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. విష్ణు ఎడ్వన్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను సుబ్లాషిణి, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఇక పూజా హెగ్డే అందాలవిందు గురించి తెల్సిందే. రెడ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో అమ్మడు మరింత హాట్ గా కనిపించింది.


ఇక పూజాతో పాటు ఈ సాంగ్ లో సౌబిన్ చిందేస్తూ కనిపించాడు. అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున కూడా ఈ సాంగ్ లో స్టెప్స్ వేయనున్నాడని, అది సర్ప్రైజ్ గా థియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారని సమాచారం. దీంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాసగటు 14 న రిలీజ్ అవుతుంది. ఆ తరువాతి రోజునే వార్ 2 రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ గా నిలుస్తుందో చూడడం కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - Jul 11 , 2025 | 06:50 PM