Pawan Kalyan: లిఫ్ట్‌లో ఇరుక్కొని డైరెక్టర్ కొడుకు మృతి.. సంతాపం తెలిపిన‌ పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:18 PM

కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నడ డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ (Kirtan Nadagouda) కుమారుడు నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి మరణించాడు.

Pawan Kalyan

Pawan Kalyan: కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నడ డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ (Kirtan Nadagouda) కుమారుడు నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి మరణించాడు. దీంతో డైరెక్టర్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలియడంతో కన్నడ ఇండస్ట్రీ సైతం శోకసంద్రంలో మునిగిపోయింది. అందరూ సోనార్ష్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కీర్తన్ కి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సోనార్ష్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ' దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ దుర్మరణం పాలయ్యాడు. నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో శివైక్యం చెందిన విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి దంపతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్ర శోకం నుంచి తేరుకొనే మనో ధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలని పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నాను' అంటూ ఎక్స్ ద్వారా సంతాపం తెలిపారు.

ఇక కీర్తన్ గురించి చెప్పాలంటే కన్నడలో ఆయన ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశాడు. కెజిఎఫ్ సినిమాకు సెకండ్ డైరెక్టర్ గా వర్క్ చేసింది కూడా కీర్తనే. ఇక ప్రశాంత్ నీల్ శిష్యుడిగా ఈమధ్యనే తెలుగులో ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 8 వసంతాలు ఫేమ్ హను రెడ్డి, సూర్య రాజ్ వీరబత్తిని హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రీతీ పగడాల హీరోయిన్ గా నటిస్తుంది. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్రం పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి సినిమా దర్శకత్వం వహిస్తున్న ఆనందంలో ఉన్న కీర్తన్ కి కొడుకు మరణం అనేది పెద్ద దెబ్బని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 06:48 PM