Ooty: ఊటీలో.. ఆ పార్కుల్లో షూటింగ్స్‌ చేసుకోవ‌చ్చు

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:54 PM

నీలగిరి జిల్లా ఊటీలో షూటింగ్‌లకు అనుమతిస్తున్నట్లు ఆ జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

ooty

ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం నీలగిరి (Nilgiri) జిల్లా ఊటీ (Ooty)లో షూటింగ్‌లకు అనుమతిస్తున్నట్లు ఆ జిల్లా యంత్రాంగం (Horticulture Department )ప్రకటించింది. దేశంలోనే ప్ర‌సిద్ధ ప‌ర్యావ‌ర‌ణ‌, పర్యాటక కేంద్రంగా పేరొందిన ఊటీని ఏడాదికి సుమారు 30 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా, వేసవి సీజన్‌లో మాత్రమే పర్యాటకుల సంఖ్య 8 లక్షలపైనే ఉంటుంది.

అయితే.. వేసవి సీజన్‌ పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా ఊటీ బొటానికల్‌ గార్డన్‌, రోజా పార్క్‌, కున్నూర్‌ సిమ్స్‌ పార్క్‌ తదితర పర్యాటక ప్రాంతాలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలలు సినిమా షూటింగ్‌లకు నిషేధం విధించారు.

ప్రస్తుతం సీజన్‌ ముగియడంతో సినిమా షూటింగ్‌లకు అనుమతించినట్లు, ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించి తగిన రుసుము చెల్లించి షూటింగ్‌లకు అనుమతి పొందవచ్చని అధికారులు తెలిపారు. దీంతో రానున్న ఎనిమిది, తొమ్మిది నెల‌లు వ‌రుస సినిమా షూటింగుల‌తో ఊటీ క‌ళ‌క‌ళ‌లాడ‌నుంది. అంతేగాక అక్క‌డి వ్యాపారాల‌కు మ‌ళ్లీ కాస్త ఊపందుకోన‌న్నాయి.

Updated Date - Jul 02 , 2025 | 12:54 PM