Sardar2: సర్దార్2.. కార్తి లుక్ అదిరింది
ABN , Publish Date - May 25 , 2025 | 02:30 PM
ప్రముఖ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘సర్దార్’.
ప్రముఖ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ (PS Mithran) దర్శకత్వంలో కార్తీ (Karthi) హీరోగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘సర్దార్’. 2022లో విడుదలై ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే దీనికి కొనసాగింపుగా సర్దార్ 2 (Sardar 2) ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించగా గత సంవత్సరం హీరో కార్తీ (Karthi) పుట్టిన రోజు మే25న ఈ సినిమా షూటింగ్ సైతం ప్రారంభించారు. సర్దార్ మొదటి భాగం ఎండింగ్‌లో తదుపరి మిషన్ కంబోడియాలో జరగబోతోందని దర్శకుడు చెప్పారు. అక్కడి నుంచే ఈ సినిమా ప్రారంభం కానుంది
ఇదిలాఉంటే.. ఇప్పటికే దాదాపు షేటింగ్ పూర్తి చేసుకున్న సర్దార్2 విడుదలకు ముస్తాబవుతుంది. ఈక్రమంలో ఈ రోజు (ఆదివారం) కార్తి (Karthi) జన్మదినం సందర్భంగగా మేకర్స్ సినిమా నుంచి ఓ అదిరిపోయే పోస్టర్ విడుదల చేసి బర్త్ డే విశెష్ తెలిపారు. ఈ లుక్ చూస్తే ఈ చిత్రంలోనూ కథంతా ఓల్డ్ సర్దార్ క్యారెక్టర్ చుట్టూనే తిరేగాలా ఉన్నట్లు తెలుస్తోంది.
అషికా రంగనాథ్ (Ashika Ranganath), మాళవిక మోహనన్ (Malavika Mohanan) , రాజీశ విజయన్ (Rajisha Vijayan) కథానాయికలుగా చేస్తోండగా ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ ఇతర అన్ని విషయాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.