Nayanatara: పెళ్లి చేసుకోవ‌డం మిస్టేక్‌.. న‌య‌న్ ఏంటి అంత మాట అనేసింది

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:03 PM

లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ స్టేట్మెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. భర్త విష్ణేశ్ శివన్‌పై కోపాన్ని చూపిస్తూ పెట్టినట్టు అనిపించిన ఆ పోస్ట్ కొద్ది సేపటికే డిలీట్ అయ్యింది.

nayanatara

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanathara), భ‌ర్త‌ విష్నేశ్ శివన్‌ (Vignesh Shivan)లు ఇద్ద‌రు ప్రస్తుతం తమ ఇద్దరి బిడ్డలతో మ‌ద‌ర్‌, ఫాద‌ర్ హుడ్‌ల‌ను ఆస్వాదిస్తున్నారు. మ‌రోవైపు వ‌రుస సినిమాలు చేస్తూనే బిజీగా గ‌డుపుతున్నారు. తాజాగా నయనతార తెలుగులో చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తోంది. గ‌తంలో ధ‌నుష్‌తో ఓ వీడియో విష‌యంలో జ‌రిగిన వ్య‌వ‌హారం కాంట్ర‌వ‌ర్సీగా మారి కొన్ని రోజులు వార్త‌ల్లో ప్ర‌ధానంగా నిలిచింది. ఆ ఇష్యూ ఇప్పుడు కోర్టులో ఉండ‌గా న‌య‌న్ మాత్రం ఇటీవ‌ల భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చూస్తూ ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ నెట్టింట హాడావుడి చేస్తోంది. రెండు రోజులుగా ఇండియాలో ఆల‌యాలు ద‌ర్శించుకుంటూ భ‌క్తి పార‌వ‌శ్యంలో ఉంది. ఇటీవ‌లే మూడ‌వ వివాహా వార్షికోత్స‌వం కూడా పూర్తి చేసుకున్నారు.

nayantharavignesh.jpg

అయితే.. ఇది ఇలాఉండ‌గానే తాజాగా న‌య‌న‌తార విష‌యంలో ఓ న్యూస్ ఇప్పుడు టోట‌ల్ ఇండియాలో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ స్టోరీ పోస్ట్ ఈ జంట మధ్య విభేదాలపై ఊహాగానాలకు తావిస్తోంది. తాజాగా న‌య‌న‌తార త‌న ఇన్ స్టా అకౌంట్‌లో Marriage is a mistake when you get married to a stupid guy. You do not have to take responsibility of your husband's actions because men generally won't grow up. Better leave me TF alone. I'm so done. (తెలివి త‌క్కువ వారిని పెళ్లి చేసుకోవ‌డం మ‌న త‌ప్పు.. వారు చేసే ప‌నుల‌కు మ‌నం బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం లేదు.మ‌గ వాళ్లు ఎప్పుడు నేర్చుకోలేరు. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న తర్వాత తన బాధ్యతను స‌రిగ్గా నిర్వ‌హ‌హించ‌డం లేదని.. ఇక నా వ‌ళ్ల కాదు ద‌య‌చేసి వ‌దిలేయండి) అనే అనే అర్థం వ‌చ్చే మాట‌లతో ఓ పోస్టు పెట్టి కాసేప‌టికి డిలీట్ చేసింది.

nayanatara

దీంతో ఒక్క‌సారిగా ఈ పోస్టు వైర‌ల్ అయింది. అయితే.. ఈ స్టేట్మెంట్‌ను నయనతార స్వయంగా పోస్ట్ చేశారని కొంతమంది అంటుండ‌గా మ‌రి కొంత‌మంది మాత్రం ఫేక్ అంటూ కొట్టి ప‌డేస్తున్నారు. మ‌రెవ‌రినైనా ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ వార్త‌ల‌పై న‌య‌న‌తార గానీ, విఘ్నేష్ గానీ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించి ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. వీరిద్ద‌రిలో ఎవ‌రైనా అధికారికంగా ప్ర‌క‌టిస్తే గానీ ఈ వార్త‌ల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం లేదు. అప్ప‌టివ‌ర‌కు ఇలాంటి అనేక వార్త‌లు మ‌రిన్ని వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ పోస్టు పెట్టి డిలీట్ చేసిన రోజే న‌య‌న్ దంప‌తులు ఇరువురు క‌లిసి మురుగ‌న్ టెంపుల్‌ను సంద‌ర్శించడం గ‌మ‌నార్హం.

nayanatara

Updated Date - Jul 04 , 2025 | 01:02 PM