Nayanthara-Vignesh Shivan: 3వ వసంతంలోకి.. నయన్, విఘ్నేశ్ జంట! ఘనంగా సెలబ్రేషన్స్
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:45 PM
సౌత్ సూపర్ స్టార్ నయన్‌తార మూడేండ్ల క్రితం దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుని వివాహాబందాన్ని ఎంజాయ్ చేస్తోంది.
సౌత్ సూపర్ స్టార్ నయన్‌తార (Nayanthara) మూడేండ్ల క్రితం దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)ను పెళ్లి చేసుకుని వివాహాబందాన్ని ఎంజాయ్ చేస్తోంది. మరో వైపు ఒకదాని తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.
తాజాగా వీరి నిర్మాణంలో తెరకెక్కిన లిక్ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఈ జంట సోమవారం తమ మూడవ వివాహా వార్షికోత్సవం సందర్భంగా పాత జ్ఞాపకాలను గర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను పంచుకున్నారు.
మనంలో మనం ఎవరం ఎక్కువగా ప్రేమిస్తామనే విషయంలో ఆశ్చర్యపోతోంటాం.. ఆ ప్రశ్నకు మాత్రం ఎప్పుడూ మన మధ్య జవాబు దొరకలేదు.. మన బంధం గురించి వివరించలేం.. నువ్వే నా సర్వస్వం, ప్రపంచం.. ఇద్దరం కాస్తా నలుగురం అయ్యాం.. ఇంత కంటే ఎక్కువగా నేనేం అడగగలను.. ప్రేమంటే ఏంటో.. ప్రేమ ఎలా ఉండాలో నువ్వే నాకు నేర్పించావు.. చూపించావు.. హ్యాపీ యానివర్సరీ మై పార్ట్నర్ అంటూ పిల్లలతో కలిసి ఉన్న ఉన్న ఫొటోలను నయన్ తన సోషల్ అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలు తిలకించిన, తిలకిస్తున్న నయన తార అభిమానులు చాలామంది వారు వైవాహిక జీవితం కలకాలం ఇలానే హ్యాపీగా సాగాలని కోరుతూ ట్వీట్లు పెడుతున్నారు. అయితే.. నయన్.. విఘ్నేష్ శివన్ ప్రేమ పెళ్లికి ముందు ప్రభుదేవా..శింబులతో ప్రేమలో పడిన నయనతార..
ఆ తర్వాత అందరికీ షాక్ ఇస్తూ తనతో నేను రౌడీనే అనే సినిమా తీసిన దర్శకుడు విఘ్నేష్ శివన్ ను 2022 జూన్ 9న ప్రేమ వివాహం చేసుకుంది. ఆపై సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరి వివాహం వీడియో నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కూడా అయి పెద్ద సంచలనం సృష్టించింది కూడా.