Narivetta : టొవినో సినిమా .. ఒక రోజు ముందే వ‌చ్చింది

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:26 PM

మలయాళంలో హిట్ టాక్ తో దూసుకెళ్లిన  నరివెట్ట సినిమా  సోనీలివ్‌ వేదికగా ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్‌ కావాల్సి ఉంది.

టొవినో థామస్‌ (Tovino Thomas) కీలకపాత్ర పోషించిన  యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా ‘నరివెట్ట’ (Narivetta). మలయాళంలో హిట్ టాక్ తో దూసుకెళ్లిన ఈ సినిమా ‘సోనీలివ్‌’ (SonyLiv) వేదికగా ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్‌ కావాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే ‘నరివెట్ట’ సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.  ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ ఆడియోతో ఈ సినిమాను వీక్షించవచ్చు. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ30 కోట్లు వసూలు చేసింది.

ఇందులో టొవినో థామస్‌ కానిస్టేబుల్‌గా నటించారు. సూరజ్‌ వెంజరమూడు, చేరన్‌  కీలక పాత్రలు పోషించారు. అనురాజ్‌ మనోహర్‌ దర్శకత్వం వహించారు. ముత్తంగ ఘటన ఆధారంగా అబిన్‌ జోసెఫ్‌ రాసిన కథ ఇది. ముత్తంగకు చెందిన ఆదివాసీలు, పోలీసుల మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది? ఆ ఘటన తర్వాత కానిస్టేబుల్‌ వర్గీస్‌ పీటర్‌ (టొవినో)లో వచ్చిన మార్పేంటన్నది ఈ సినిమా కథ.

Updated Date - Jul 10 , 2025 | 04:15 PM