Nadigar Sangam: శరవేగంగా.. నడిగర్ సంఘం భవన నిర్మాణం! వీడియో
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:27 PM
నడిగర్ సంఘం కొత్త భవన నిర్మాణ పనులు టి.నగర్, హబీబుల్లా రోడ్డులో జరుగుతున్నాయి.
నడిగర్ సంఘం (Nadigar sangam) కొత్త భవన నిర్మాణ పనులు టి.నగర్, హబీబుల్లా రోడ్డులో జరుగుతున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో తెలియజేస్తూ నడిగర్ సంఘం తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది.
ఈ భవన సముదాయంలో అతిపెద్ద ఆడిటోరియం, మీటింగ్ హాల్, మినీ కన్వెన్షన్ హాల్, డైనింగ్ హాల్, నడిగర్ సంఘ కార్యాలయం, అద్దెకు ఇవ్వనున్న ఫ్లోర్, పార్కింగ్ ఇలా అన్ని సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఈ వీడియో ఆఖరులో నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ, ‘ఒక పెద్ద కల. మేము తీసుకున్న కర్తవ్యం. ఈ రోజు పురోగతిలో ఉంది. అది త్వరలోనే పూర్తికానుంది. కల నిజమవుతుంది. దక్షిణ భారత నటీనటుల సంఘం గర్వం ఆకాశంలో ఎగురబోతోంది’ అని పేర్కొన్నారు.