Upendra: నేనే బాగానే ఉన్నా.. ఆ వార్తలు నమ్మొద్దు
ABN , Publish Date - May 05 , 2025 | 09:50 PM
కన్నడ రియల్‌స్టార్ ఉపేంద్ర అనారోగ్యానికి గురయ్యారంటు సొమవారం ఒక్క సారిగా వార్తలు గుప్పుమనడంతో సోషల్ మీడియా, నేషనల్ మీడియా అంతా షాక్ గురైంది.
కన్నడ రియల్‌స్టార్ ఉపేంద్ర (Upendra) అనారోగ్యానికి గురయ్యారంటు సొమవారం ఒక్క సారిగా వార్తలు గుప్పుమనడంతో సోషల్ మీడియా, నేషనల్ మీడియా అంతా షాక్ గురైంది. దీంతో తమ అభిమాన నటుడికి ఏమైందంటూ అభిమానులు కన్నడనాట తెగ ఆందోళన చెందుతున్నారు. తెలిసిన వారిని ఉప్పి ఆరోగ్యం గురించి వాకబు చేస్తోండగా చాలా మంది గూగుల్ చేస్తూ విషయం తెలుసుకుంటున్నారు.
అయితే.. ఉపేంద్రకు అనారోగ్యం అన్న వార్తల నేపథ్యంలో ఉన్నవి లేనివి ఒకటికి రెండు జోడించి న్యూస్ వైరల్ అయి దేశ మంతా వ్యాపించాయి. దీంతో అంతటా ఓ కన్ఫ్యూజన్ ఎర్పడి అసలు ఉపేంద్రకు ఏమైందైనే సందేహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉపేంద్ర, ఆయన భార్య నటి ప్రియాంక స్పందించారు. మీడియాలో అదే పనిగా వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. రెగ్యులర్ చెకప్ నిమిత్తమే దవాఖానకు వెళ్లడం జరిగిందని, అంతకు మించి మరేమి లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టు సైతం పెట్టారు.
ఇదిలాఉండగా ఉపేంద్ర ఇప్పటికే యూఐ సినిమాతో అలరించగా మరో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌తో చేసిన455 సినిమా తెలుగు, కన్నడలో విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ కాంత్ హీరోగా వస్తున్న కూలీ చిత్రంలోనూ ఉప్పి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఓ తెలుగు చిత్రం కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.