Mrunal Thakur: ధనుష్ సాంగ్ పాడుతూ అడ్డంగా దొరికిన మృణాల్ .. ప్రేమ బాగా ముదిరినట్టుందే
ABN , Publish Date - Aug 09 , 2025 | 10:53 PM
అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రేమ వ్యవహారం గురించే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) తో ఈ చిన్నది ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు గుమ్మెత్తిపోస్తున్నాయి.
Mrunal Thakur: అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రేమ వ్యవహారం గురించే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) తో ఈ చిన్నది ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు గుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ధనుష్ - మృణాల్ మధ్య వ్యవహారం హద్దు మీరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి బాలీవుడ్ మొత్తం చక్కర్లు కొడుతున్నారు అనేది ఒకటి అయితే.. మృణాల్ ఎక్కడకు వెళ్లినా ధనుష్ పేరునే పలుకుతుందని టాక్ నడుస్తోంది. అసలు వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయకుండానే ఇన్ని రూమర్స్ రావడానికి కారణం ఏంటి.. ?
మృణాల్ ఠాకూర్ బర్త్ డే కు బాలీవుడ్ మొత్తం అటెండ్ అయినా స్సెషల్ ఎట్రాక్షన్ ఎవరు అంటే ధనుష్ అని చెప్పాలి. అసలు వీరిద్దరికీ ఎక్కడ పరిచయం.. ? ఈ పరిచయం ప్రేమగా ఎక్కడ మారింది.. ? అనేది ఇప్పటివరకీ తెలియరాలేదు. అయితే ప్రేమ తరువాత వ్యవహారం మాత్రం చకాచకా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ధనుష్ కుటుంబాన్ని మృణాల్ కలిసిందని తెలుస్తోంది. అంతేనా మృణాల్ .. ధనుష్ సిస్టర్స్ ను సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది కూడా. అలా వీరి వ్యవహారం ముదిరింది అని మాట్లాడుకుంటున్నారు.
ఇక మృణాల్ అక్కడితో ఆగలేదు. సాధారణంగా ఇలాంటి రూమర్స్ వచ్చాయి అంటే ఎప్పుడో ఒకసారి హీరో కానీ, హీరోయిన్ కానీ ఖండిస్తారు. కానీ, ఇక్కడ అలా జరగకపోనూ.. మృణాల్ ఇంకా రెచ్చిపోయి తమ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకొనేలా చేస్తుంది. తాజాగా మృణాల్.. ధనుష్ నటించిన ఇడ్లీ కడై చిత్రంలోని సాంగ్ ను కారులో ప్లే చేసి.. దానికి తగ్గట్లు సాంగ్ కూడా పాడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. ఇక్కడ ఏకంగా మంటే వస్తుంది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి చివరకు ఈ జంట ఎక్కడ. వరకు వెళ్లి ఆగుతారో చూడాలి.