Vrusshabha: గీతా ఆర్ట్స్ ద్వారా ‘వృషభ’.. మోహ‌న్‌లాల్ మ‌రో హిట్ కొట్టేలా ఉన్నాడుగా

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:25 AM

మోహన్‌ లాల్ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘వృషభ’చిత్రాన్ని ఈ నెల 25న పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రం విడుదలవుతోంది. తెలుగులో గీతా ఆర్ట్స్ విడుద‌ల చేస్తోంది.

Mohanlal Vrusshabha

మలయాళ కథానాయకుడు మోహన్‌ లాల్ (Mohanlal) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘వృషభ’(Vrusshabha). నందకిశోర్ (Naandda Kishore) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కనెక్ట్‌ మీడియా (Connekkt Media), బాలాజీ టెలీఫిల్మ్స్ (Balaji Motion Pictures), అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌ స్టూడియోస్‌ బేనర్లపై శోభా కపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, సీకే పద్మకుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌, ప్రవీర్‌ సింగ్‌, విశాల్‌ గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతా నిర్మించారు. ఈ నెల 25న పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రం విడుదలవుతోంది. తెలుగులో అల్లు అర‌వింద్‌ (Allu Aravind) గీతా ఆర్ట్స్ (Geetha Arts) విడుద‌ల చేస్తోంది.

తాజాగా.. మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆదిదేవ వర్మ అనే వ్యాపారవేత్తగా.. అసమాన యోధుడు రాజా విజయేంద్ర వృషభగా రెండు విభిన్న పాత్రల్లో మోహన్‌లాల్‌ కనిపించనున్నారు. ఇందులో కథానాయకుడి వర్తమానానికి.. గత జన్మ తాలుకూ జ్ఞాపకాలకూ ఉన్న సంబంధం ఏంటనేది ఆసక్తికరంగా చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. సమర్జిత్‌ లంకేశ్ (Samarjit Lankesh), రాగిణి ద్వివేది (Ragini Dwivedi), నయన్‌ సారిక (Nayansarika), అజయ్‌, నేహా సక్సేనా, గరుడ రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Dec 21 , 2025 | 06:25 AM