Mohanlal: ఒకదాన్ని మించి మరోటి.. హిస్టరీ క్రియేట్ చేసిన మోహన్ లాల్
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:10 PM
2025లో మోహన్‌లాల్ కేరళ బాక్సాఫీస్‌లో ₹250 కోట్లతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఎల్2-ఎంపురాన్, తుడారం, హృదయపూర్వం హిట్లతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్న మలయాళ లెజెండ్.
మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) మరోసారి తన సత్తా చాటుకున్నాడు. 2025 సంవత్సరం ఆయన కేరీర్‌లోనే గోల్డెన్ ఇయర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వయసు మీద పడుతున్నా ఒకదాని తర్వాత మరోటి సినిమాలు చేస్తూ వాటిని రిలీజ్ చేసి అంతకుమించి విజయాలు సాధిస్తూ కుర్ర హీరోలకు సింహాస్వప్నంలా మారాడు. ఈ ఒక్క సంవత్సరమే కేరళ బాక్సాఫీస్ వద్ద ₹250 కోట్ల కలెక్షన్లు సాధించి మలయాళ నటులందరికీ ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు.
ఏడాది ఆరంభంలో వచ్చిన L2-ఎంపురాన్ (86.25 కోట్లు), తుడరం (118.90 కోట్లు), చొట్ట ముంబై (రీ-రిలీజ్) ( ₹3.61 కోట్లు), తాజాగా హృదయపూర్వం (41.32 కోట్లు) సినిమాల విజయాలతో మోహన్‌లాల్ కేరళలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా కలెక్షన్ల వర్షం కురిపించారు. గ్లోబల్ బాక్సాఫీస్‌లో మొత్తం ₹550 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, మలయాళ సినిమాకు కొత్త శిఖరాలను చూపించి చరిత్ర సృష్టించారు. మలయాళ సినిమాలను కొత్త పుంతలు తొక్కించారు.
ఇదిలాఉంటే.. ఓ వైపు వరుసబెట్టి హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న మోహన్‌లాల్‌కు సడన్‌గా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో మోహన్‌లాల్‌ను సత్కరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో నెలలో వృషభ అనే ఓ ఫాంటసీ అడ్వంచర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు మోహన్ లాల్ సిద్దమయ్యాడు. ఇలా ఈ 2025 మోహన్‌లాల్ కెరీర్‌లో ఒక మైలురాయి సంవత్సరంగా నిలిచిపోయింది. ఆయన రాబోయే సినిమాలు కూడా అంతే స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయని ఫిల్మ్ నిపుణులు అంటున్నారు.