Chennai: చెన్నైలో షాకింగ్ ఘటన: బాలికతో వ్యభిచారం.. హాస్య నటుడు సహా ఆరుగురి అరెస్ట్!

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:26 AM

చెన్నైలో మైనర్ బాలికతో వ్యభిచారం కేసులో హాస్యనటుడు భారతి కన్నన్, అతని స్నేహితులు సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

chennai

త‌మిళ‌నాడు రాజధాని చెన్నైలో మానవత్వాన్ని కలచివేసే ఓ ఘటన వెలుగు చూసింది. స్థానిక వంద అడుగుల రోడ్డులోని ఓ వసతి గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు కోయంబేడు మహిళా పోలీసులు గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికను రక్షించి కేసు నమోదు చేశారు.

తదుపరి దర్యాప్తులో పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ సహాయనటి నాగలక్ష్మి, మరో నటి అంజలి, కార్తిక్, కుమార్‌లను అరెస్టు చేసి విచారించ‌గా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి మృతి తర్వాత బాలిక తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంతో, ఆ బాలిక తల్లి స్నేహితురాలైన క్లబ్ డ్యాన్సర్ పూంగొడి, ఆమె స్నేహితురాలు ఐశ్వర్య వద్దకు చేరిందని పోలీసులు తెలిపారు.

ఈ ఇద్దరూ బాలికను వలలో వేసి, హాస్య నటుడు భారతి కన్నన్ (Bharathi Kannan), అతని స్నేహితులు మహేంద్రన్, రమేష్ సహకారంతో వ్యభిచారం చేయించి డబ్బు సంపాదించినట్లు విచారణలో బయటపడింది. పోలీసులు మంగళవారం పూంగొడి, ఐశ్వర్యలను అరెస్టు చేశారు.

అదేవిధంగా భారతి కన్నన్, మహేంద్రన్, రమేష్‌లను పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో సినీ, సామాజిక వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. మైనర్ బాలికను ఈ దారుణానికి పాల్ప‌డ్డ‌ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:30 AM