Trupti Ravindra: హీరోయిన్‌గా.. మరాఠీ స్టేజ్ ఆర్టిస్ట్
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:08 PM
స్టేజీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన తృప్తి రవీంద్ర వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది.
స్టేజీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన తృప్తి రవీంద్ర (Trupti Ravindra) తమిళ వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. మహారాష్ట్రకు చెందిన ఈ భామ.. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘శక్తి తిరుమగన్’ (భద్రకాళి) చిత్రంలో నటించగా, ఈ నెల 19న తమిళం, తెలుగు భాషల్లో విడులకానుంది. ఈ సినిమా అనుభవాలను తృప్తి వివరిస్తూ, ‘నేను నటనలో శిక్షణ పొందాను. స్టేజ్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను.
ఇపుడు ‘శక్తి తిరుమగన్’లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అరుణ్ ప్రభు దర్శకుడు. మల్టీటాలెంటెడ్‌గా గుర్తింపు పొందిన విజయ్ ఆంటోనీతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాను.
తమిళ, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ఎంతగానో ఇష్టపడుతున్నా. తమిళంను కూడా నేర్చుకుంటున్నాను. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే పాత్రలను ఇచ్చే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.