Kalamkaval: మమ్ముట్టి.. కొత్త క్రైమ్ థ్రిల్లర్! టీజర్ అదిరింది
ABN , Publish Date - Aug 29 , 2025 | 06:03 AM
మలయాళంలో మరో ఆసక్తికరమైన చిత్రం విడుదలకు రెడీ అయింది.
మలయాళంలో మరో ఆసక్తికరమైన చిత్రం విడుదలకు రెడీ అయింది. మమ్ముట్టి (Mammootty) హీరోగా ఓ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ చిత్నం కలంకావల్ (Kalamkaval) షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు ముస్తాబవుతోంది. ఓనమ్ పండుగ సందర్భంగా ఇటీవల ఆగస్టు 28 గురువారం రాత్రి కేరళలో లోకా సినిమా ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లలో ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు.
ఈ మూవీ ద్వారా జితిన్ కే జోష్ (Jithin K Jose) డైరెక్టర్‌గా ఆరంగేట్రం చేస్తుండగా స్వయానా మమ్ముట్టి ప్రొడక్షన్ హౌజ్ (Mammootty Kampany) నిర్మిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో మీరా జాస్మిన్ (Meera Jasmine) కథానాయిక కాగా రాజీషా విజయన్ (Rajisha Vijayan), వినాయకన్ (Vinayakan), గిబిన్ గోపీనాథ్ (Gibin Gopinath) కీలక పాత్రలు చేస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ఆఫీసియల్ టీజర్‌ను బట్టి చూస్తే ఓ సీరియస్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా వినియకన్ జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరో వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇక మమ్ముట్టి కల్లజోడు ధరించి సిగరెట్ కాలుస్తూ ఒక సైడ్ నుంచి మరో సైడ్కు తిప్పుతూ తన హావాభావాలు, కళ్లతోనే సినిమా ఎలా ఉండబోతుందో జీవించి చూపించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ కలంకావల్ (Kalamkaval) చిత్రం సెప్టెంబర్ చివరలో కేవలం మలయాళంలో మాత్రమే థియేటర్లకు రానుంది.