Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో చాకో తండ్రి మృతి! ఐసీయూలో నటుడు
ABN , Publish Date - Jun 06 , 2025 | 10:58 AM
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ, తెలుగు నటుడు షైన్ టామ్ చాకో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ, తెలుగు నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆయన తండ్రి సీపీ చాకో (C.P. Chacko) ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం తమిళనాడులో జరిగింది.
ఎర్నాకులం నుంచి కారులో బెంగళూరు వెళ్తుండగా తమిళనాడు ధర్మపురి వద్ద లారీని ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో తండ్రతో పాటు సోదరుడు, తల్లి, షైన్ టామ్ చాకో ఉన్నారు. ఈ ప్రమాదంలో తల్లి, సొదరుడు, నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ఆస్పత్రిలో చిత్స పొందుతున్నారు.
మలయాళం నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు నాని దసరా, డాకూ మహారాజ్, దేవర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కేరళలో డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి బెయిల్ పై బయటకు వచ్చాడు. షైన్ టామ్ చాకో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.