GV Prakash Kumar: ఇట్స్.. ఆఫీసియల్! జీవీ ప్రకాశ్ దంపతులకు విడాకులు మంజూరు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:01 AM
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, నేపథ్యగాయని సైంధవి 12 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు.
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV PrakashKumar), ఆయన సతీమణి, నేపథ్యగాయని సైంధవి (Saindhavi) చట్టబద్ధంగా విడి పోయారు. వీరికి చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళ వారం విడాకులు మంజూరు చేసింది. 2013లో వివాహం చేసుకున్న వీరికి అన్వీ అనే కుమార్తె ఉంది. మనస్పర్థల కారణంగా గత యేడాది విడిపోతున్నట్టు ప్రకటించి, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో చివరగా ఈ నెల 25వ తేదీన విచారణ జరగ్గా, జీవీ ప్రకాశ్, సైంధవి కోర్టుకు హాజరై విడిపోయేందుకు సమ్మతం తెలిపారు. అదే సమ యంలో తన కుమార్తె సంరక్షణ బాధ్యతలను సైంధవి స్వీక రించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని జీవీ ప్రకాశ్ న్యాయమూర్తికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తుది తీర్పును మంగళవారం కోర్టు వెలువరించింది. జీవీ ప్రకాశ్ - సైంధవి దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ, కుమార్తె సంరక్షణా బాధ్యతలను సైంధవికి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.