Lokesh Kanagaraj: హీరోగా.. లోకేష్‌ కనకరాజ్‌! బాలీవుడ్.. బ్యూటీతో రొమాన్స్‌

ABN , Publish Date - Oct 31 , 2025 | 08:53 AM

‘రాకీ’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్‌ మాధేశ్వరన్‌ కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ హీరోగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Lokesh Kanagaraj

‘రాకీ’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన డైరెక్టర్‌ అరుణ్‌ మాధేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో మరో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరక్టర్‌ లోకేష్‌ కనకరాజ్ (Lokesh Kanagaraj ) హీరోగా నటించనున్నారు.

ఈ మూవీలో బాలీవుడ్‌ హీరోయిన్‌గా వామికా గబ్బిని (Wamiqa Gabbi) ఎంపిక చేశారు. తమిళంలో ‘మాలై నేరత్తు మయక్కం’ అనే చిత్రం ద్వారా వామికా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

అలాగే రవి మోహన్‌ హీరోగా రూపొందుతోన్న ‘జీని’ మూవీలోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో ఆరేండ్ల క్రిత‌మే భ‌లే మంచి రోజు సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా న‌టించిగా తాజాగా అడ‌వి శేష్ గూడాచారి సినిమాలోనే చేస్తోంది.

ఇదిలావుండగా ఈ చిత్రం కోసం లోకేష్‌ కనకరాజ్‌ తన సినిమా కోసం పలురకాల శిక్షణ కూడా పొంది షూటింగులో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ పనులు చెన్నైలో శరవేగంగా సాగుతోంది.

Updated Date - Oct 31 , 2025 | 08:59 AM