29 Movie: ఆసక్తికరంగా.. లోకేశ్ కనగరాజ్ '29' మూవీ టీజర్
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:08 AM
విదు (Vidhu), తెలుగమ్మాయి ప్రీతి అశ్రాని ( Preethi Asrani) జంటగా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తమిళంలో రూపొందుతున్న చిత్రం ట్వంటీనైన్ '29'.
విదు (Vidhu), తెలుగమ్మాయి ప్రీతి అశ్రాని ( Preethi Asrani) జంటగా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తమిళంలో రూపొందుతున్న చిత్రం ట్వంటీనైన్ '29'. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తన జీ స్క్వాడ్ (G Squad) బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తోండగా రత్నకుమార్ (Rathnakumar) రచయిత, దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పేరును ప్రకటిస్తూ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసి '29' అనే పేరును అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉంది.
ఓ అమ్మాయి చాలామందిని నీవెవరు అని ప్రశ్నించడం వాళ్లు వారి పేర్లు, చేస్తున్న ఉద్యోగాలు చెప్పడం జరుగుతుంది. చివరకు ఓ యువకుడిని నీవెవరు అని అడగ్గా మరో ఆలోచన లేకుండా నాకు తెలియదు అని చెప్పేయడం, ఆ క్రమంలో నేనెవరిని అని తనలో తానే ఆలోచించుకోవడం చివరకు బస్సులో తన పక్కే కథానాయిక వచ్చి కూర్చోవడం వంటి సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉన్నాయి.