Lokesh Kanagaraj: 35 ఏండ్ల తర్వాత రజనీ, కమల్ కాంబో? ఆ ఊహే..
ABN, Publish Date - May 12 , 2025 | 12:40 PM
ప్రస్తుత తమిళనాట వరుస సూపర్‌హిట్ సినిమాలతో హీరో రేంజ్ పలుకుబడితో దూసుకుపోతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్.
ప్రస్తుత తమిళనాట వరుస సూపర్‌హిట్ సినిమాలతో హీరో రేంజ్ పలుకుబడితో దూసుకుపోతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). సందీప్ కిషన్ ‘మానగరం’ తో మొదలుపెట్టి, ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి బ్లాక్‌బస్టర్‌లతో తన సత్తా చాటిన ఈ యంగ్ డైరెక్టర్ ఫస్ట్ టైం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ని సృష్టించి సౌత్ సినిమా రేంజ్‌ను పెంచాడు. చేసిన, చేస్తున్న ప్రతి సినిమాతో అంతకుమించి అనేలా కాంబినేషన్‌లు సెట్ చేస్తూ కనివినీ ఎరుగని విధంగా బాక్సాఫీస్‌కు విజయాలు సాదిస్తూ అందరి అంచనాలను మించి ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా సూపర్‌స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) తో తెరకెక్కిస్తున్న కూలీ (Coolie) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా ఆగస్టులో సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రజనీకాంత్ 171వ చిత్రం. ఈ సినిమా షూటింగ్ పూర్తైన నేపథ్యంలో లోకేష్ తన కానున్న ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. ఈక్రమంలో తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా మొదటగా కార్తీతో ‘ఖైదీ 2’, ఆపై కమల్ హసన్‌తో ‘విక్రమ్ 2’, సూర్యతో ‘రోలెక్స్’ సినిమాలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇటీవల లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
కాగా ప్రస్తుత జనరేషర్‌లో లోకేష్ కనగరాజ్ మాత్రమే ఈ కాంబినేషన్‌ను హ్యాండిల్ చేయగల డైరెక్టర్ అని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్, కమల్‌హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ (Rajinikanth) లాంటి బిగ్ స్టార్స్‌తో సినిమాలు చేసిన అనుభవం, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలను రూపొందించడంలో ఉన్న నైపుణ్యం రజనీ, కమల్ కాంబో సినిమా తెకరెక్కించడంలో దోహద పడుతాయని అంటున్నారు. అదీగాక ప్రస్తుత జనరేషన్‌లో రజనీ, కమల్ లాంటి ఇద్దరు లెజెండ్స్‌ను ఒకే తెరపై చూడడం అభిమానులకు ఓ విజువల్ ట్రీట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ముందుపడితే దక్షిణాది సినిమా చరిత్రలో ఓ రికార్డ్ గా నిలుస్తుందరి అంతా భావిస్తున్నారు. ఈ సినిమా ఎలాగైనా ఫైనల్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో.