Jovita: హీరోయిన్‌గా హాస్యనటుడి కుమార్తె
ABN , Publish Date - Nov 27 , 2025 | 07:26 AM
ప్రముఖ హాస్య నటుడు లివింగ్‌స్టన్ కుమార్తె జోవిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
ప్రముఖ హాస్య నటుడు లివింగ్‌స్టన్ (Livingston) కుమార్తె జోవిత (Jovitha) హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. కేఎస్ కిషాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆమె కథానాయిక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, ‘నా నిరీక్షణ ఫలించింది. హీరోయిన్‌గా ఓ చిత్రంలో నటిస్తున్నాను. ఇది హార్రర్ జానర్ మూవీ. సినిమాల్లో నటించడం మా నాన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ, ఆయనకు నచ్చజెప్పిన తర్వాతే సినిమాల్లోకి వచ్చాను. ఈ చిత్రంలో నాన్న కూడా ఓ పాత్ర పోషిస్తున్నారు. మేమిద్దరం ఇప్పటివరకు కలిసి నటించిన సందర్భాలు లేవు’ అన్నారు. (Tamil actress)

అలాగే, తన కుమార్తె సినీ రంగ ప్రవేశంపై లివింగ్‌స్టన్ మాట్లాడుతూ, ‘సినిమాల్లో ఎల్లవేళలా ఒకే తరహా సక్సెస్ ఉండదు. అందుకే సినిమాకు దూరంగా ఉండాలని చెప్పాను. ఆమె గాయని కావాలని ఆశపడ్డాను. కానీ నటించాలని నిర్ణయం తీసుకుంది. మంచి కంటెంట్ కథలు విజయం సాధిస్తాయన్నారు.