Theater Movies: ఈ వారం.. దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోన్న సినిమాలివే
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:49 PM
ఈ వారం ఆ ఇండస్ట్రీ నుంచి తప్పితే చెప్పుకోతగ్గ సినిమా ఏది కూడా థియేటర్లలోకి రావడం లేదు.
ఈ వారం దేశవ్యాప్తంగా థియేటర్లలో సినిమాల సందడి అంతంత మాత్రంగానే ఉంది. హాలీవుడ్ తప్పితే మరే ఇండస్ట్రీ నుంచి చెప్పుకోతగ్గ సినిమా ఏది కూడా థియేటర్లలోకి రావడం లేదు. అన్ని చిన్న చిత్రాలే ప్రేక్షకుల ఎదుటకు వస్తున్నాయి. వాటిలో తెలుగు నుంచి అనుపమా పరమేశ్వరన్ పరదా, నరేశ్ ఆగస్త్య మేఘాలు చెప్పిన ప్రేమ కథ, నారాయణ మూర్తి నటించి, దర్శకత్వం వహించిన యూనివర్సిటీ పేపర్ లీక్ వంటి మూడు స్ట్రెయిట్ చిత్రాలు విడుదలవుతున్నాయి.
ఇక తమిళ, పంజాబీ, భాషల్లో ఒకటి చొప్పున, అస్సామీస్, మరాఠి, మలయాళ భాషల్లో రెండేసి సినిమాలు విడుద కానున్నాయి. అంతేగాక అత్యధికంగా కన్నడ నుంచి ఐదు, హాలీవుడ్ నుంచి నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజల ఎదుటకు రాబోతున్నాయి. అయితే వీటిలో తెలుగులో పరదా, హాలీవుడ్ నుంచి వస్తోన్న నో బడీ , రిలే మరో రెండు చిత్రాలపై ప్రేక్షకులకు విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉంటే హిందీ నుంచి ఒక్క చిత్రం కూడా విడుదల కాక పోతుండడం ఇక్కడ చాలా అశ్చర్యం కలిగించే అంశం.
ఈ వారం.. థియేటర్ సినిమాలివే
Telugu
పరదా (Paradha)
యూనివర్సిటీ పేపర్ లీక్ (University Paper Leak)
మేఘాలు చెప్పిన ప్రేమ కథ (Meghalu Cheppina Prema Katha)
Tamil
ఇంద్ర (Indra)
Kannada
హచ్చే (Hacche)
కమరొట్టు 2 (Kamarottu 2)
జస్ట్ మ్యారిడ్ (Just Married
లవ్ మ్యాటరు (Love Matteru)
సన్ ఆఫ్ ముత్తన్న (Son of Muthanna)
Malayalam
పరదా (Paradha)
ది కేస్ డైరీ (The Case Diary)
English
రిలే (Relay)
నో బడి2 (Nobody 2)
విచ్‌బోర్డ్ (Witchboard)
బ్రింగ్ హర్ బ్యాక్ (Bring Her Back)
Marathi
ప్రేమాచి గోస్తా (Premachi Goshta 2)
బెటారాఫ్ లవ్‌స్టోరి (Better Half Chi Love Story)
Punjabi
పాపే కుత్తియాన్ (Phaphey Kuttniyan)
Assamese
జోథా (Joddha)
తారిఖ్(Taarikh)