Krithi shetty: కృతికి అక్కడ కాలం కలిసి రాలేదు 

ABN , Publish Date - Dec 20 , 2025 | 07:32 AM

‘ఉప్పెన’ (uppena) మూవీతో టాలీవుడ్‌ వెండితెరకు పరిచయమైన హీరోయిన్‌ కృతిశెట్టికి (krithi shetty) తమిళంలో ఎంట్రీ ఇచ్చేందుకు కాలం కలిసి రావడం లేదు.


‘ఉప్పెన’ (uppena) మూవీతో టాలీవుడ్‌ వెండితెరకు పరిచయమైన హీరోయిన్‌ కృతిశెట్టికి (krithi shetty) తమిళంలో ఎంట్రీ ఇచ్చేందుకు కాలం కలిసి రావడం లేదు. దీంతో నటించిన రెండు చిత్రాలు విడుదలలో జాప్యం జరుగుతుండటంతో ఆమె తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. గతంలో ‘ది వారియర్‌’, ‘కస్టడీ’ మూవీల్లో నటించగా, అవి తమిళంలోకి అనువదించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీలు నిరుత్సాహానికి గురిచేశాయి. దీంతో ఒక మంచి స్టైట్‌ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో ఆమె ఉన్నారు.

అందుకు తగినట్టుగానే ఆమె 2 చిత్రాలకు కమిట్‌ అయ్యారు. వాటిలో ఒకటి కార్తి నటించిన ‘వా వాత్తియార్‌’. ఈ నెల 12వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని వాయిదాపడింది. అలాగే, ప్రదీప్‌ రంగనాథన్‌ సరసన నటించిన ‘ఎల్‌ఐకే’ మూవీ విడుదలలో కూడా సందిగ్ధత నెలకొంది. ఈ రెండు చిత్రాలకు న్యాయపరమైన చిక్కులు వీడి ఎపుడు విడుదలవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో కృతిశెట్టి నిరుత్సాహం చెందుతున్నారు.

Updated Date - Dec 20 , 2025 | 07:35 AM