Sivanna: కిరీటి ప్రామిసింగ్ స్టార్ అవుతాడు
ABN , Publish Date - Jul 14 , 2025 | 08:54 AM
'కిరీటీ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. జూనియర్ టీజర్, ట్రైలర్,పాటలు చూశాను. కిరీటి చాలా అద్భుతంగా డాన్స్ చేశాడు. తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కిరిటి రూపంలో మరో ప్రామిసింగ్ స్టార్ ఇండస్ట్రీకి వస్తున్నాడు'- శివరాజ్ కుమార్
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి (KIriti Reddy)హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'జూనియర్'(Junior). రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. జూలై 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
శివరాజ్ కుమార్ మాట్లాడుతూ 'కిరీటీ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. జూనియర్ టీజర్, ట్రైలర్,పాటలు చూశాను. కిరీటి చాలా అద్భుతంగా డాన్స్ చేశాడు. తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కిరిటి రూపంలో మరో ప్రామిసింగ్ స్టార్ ఇండస్ట్రీకి వస్తున్నాడు. తను డాన్స్ లో సూపర్ సీనియర్ అనిపిస్తున్నారు. అలాగే శ్రీలీల కూడా మంచి డ్యాన్సర్. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. జెనీలియా గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఈ సినిమాలో చాలా చక్కని పాత్ర పోషించారు. రవిచంద్రన్ తో నాకు ఎప్పటినుంచో స్నేహం ఉంది. ఆయన ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు. డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సూపర్ స్టార్. జూలై 18న రిలీజ్ అవుతున్న సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ' ఇందులో రవిచంద్రన్ గారు, కిరీటి నటించిన సీన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన జెనీలియా గారు ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆ పాత్రని దేశము మొత్తం అభిమానిస్తుంది. బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలకు పనిచేసిన కెమెరామెన్ సెంథిల్ ఈ సినిమాకి పనిచేయడం కిరీటి అదృష్టం. నేను సాయి గారు కర్ణాటకలో ఒకే స్కూల్లో చదువుకున్నాం. వారాహి బ్యానర్ తో ఆయన దేశవ్యాప్తంగా చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కిరీటి చిన్న వయసులో ఉన్నప్పుడే తనతో సినిమా చేస్తానని ఆయన చెప్పడం గొప్ప ఆశీర్వాదం. పునీత్ రాజ్ కుమార్ గారి ఆశీస్సులు కిరీటిపై ఉన్నాయి. జేమ్స్ సినిమా సమయంలో కిరీటికి ఆయనతో సమయాన్ని గడిపే అదృష్టం దక్కింది. కిరీటికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ డాన్సింగ్ అంటే ఇష్టం. తను పాషన్ తోనే ఈ పరిశ్రమలోకి వస్తున్నాడు. కిరీటిపై అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మన ఇంట్లో జరిగే కథలాగా ఉంటుంది' అన్నారు.
కిరీటి మాట్లాడుతూ 'అప్పు గారు నేను సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్. నాకు ఇంత మంచి సినిమాతో లాంచ్ చేస్తున్న నిర్మాత సాయి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమా కోసం మూడేళ్లు డెడికేటెడ్ గా వర్క్ చేశారు. జెనీలియా గారు 13 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ పై కం బ్యాక్ ఇస్తున్నారు. ఆమెతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. రవిచంద్రన్ గారితో వర్క్ చేయడం నా అదృష్టం. ఆయనతో పనిచేస్తున్న రోజులని నా జీవితంలో మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా నాన్నగారు నాకోసం చాలా త్యాగాలు చేశారు. ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం.సెంథిల్ గారు నన్ను అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. విజువల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. శ్రీ లీల ఎనర్జిటిక్ కోస్టార్. చాలా డెడికేషన్ తో ఈ సినిమా చేశారు' అన్నారు
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ 'ఈ సినిమా జర్నీ చాలా వండర్ఫుల్ గా జరిగింది. రాధాకృష్ణ గారు చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఈ కథని చాలా అద్భుతంగా చెప్పారు. రవిచంద్రన్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. జెనీలియా గారితో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్ నిర్మాత సాయి గారు. చాలా ప్రేమతో ఈ సినిమా చేశారు. వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడానికి కారణం దేవిశ్రీప్రసాద్ గారు. ఆయన ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు' అన్నారు
జెనీలియా మాట్లాడుతూ 'కన్నడలో నా లాస్ట్ సినిమా శివ కుమార్ గారితో చేశాను. అది నాకు చాలా స్పెషల్ ఫిలిం .మళ్లీ జూనియర్ తో ప్రేక్షకులు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది 'అన్నారు.