Revolver Rita: రివ్వాల‌ర్‌తో.. వినాయ‌క చ‌వితికి వ‌స్తున్న రీఠా

ABN , Publish Date - Jun 12 , 2025 | 07:59 PM

నేషనల్ అవార్డ్‌ విన్నింగ్‌ హీరోయిన్ కీర్తి సురేశ్‌ టైటిల్ పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘రివాల్వర్ రీటా’.

Revolver Rita

నేషనల్ అవార్డ్‌ విన్నింగ్‌ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (Keerthi Suresh) టైటిల్ పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita). రాధిక శరత్‌కుమార్ (Radhika Sarathkumar), రెడిన్ కింగ్ స్లే (Redin Kingsley) కీలక పాత్రలు పోషించిన‌ ఈ చిత్రానికి జే.కే చంద్రు (JK Chandru) దర్శకత్వం వహించాడు.

ప్యాషన్ స్టూడియోస్ (Passion Studios) అండ్ ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం (మహారాజ్ నిర్మాత), జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందించ‌గా ప్రవీణ్ కె ఎల్ ఎడిటర్‌గా, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ఎట్ట‌కేల‌కు అధికారికంగా ప్ర‌క‌టించారు. వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆగ‌ష్టు27న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి తీసుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Updated Date - Jun 12 , 2025 | 07:59 PM