KD-The Devil: ధృవ్ సర్జా.. కేడీ టీజర్ ఇంత వయోలెంట్‌గా ఉందేంటి
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:43 PM
మార్టిన్ వంటి డిజాస్టర్ తర్వాత క్ననడ స్టార్ ధృవ్ నటించిన చిత్రం కేడీ ది డెవిల్. శుక్రవారం ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు.
ఇండియన్ స్క్రీన్ మీద యాక్షన్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. సరైన యాక్షన్ కంటెంట్ ఫిల్మ్ పడితే.. రికార్డులు బద్దలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడలాంటి యాక్షన్ చిత్రాలు కన్నడ నుంచి అధికంగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ కోవలోనే వచ్చి తెలుగులోనూ ప్రజాదరణ పొందుతున్నయాక్షన్ కింగ్ వారసుడు, కన్నడ స్టార్ ధృవ సర్జా (Dhruva Sarja) హీరోగా తెరకెక్కిన వయోలెంట్, యాక్షన్ చిత్రం కేడీ ది డెవిల్ (KD The Devil). యూఐ ఫేమ్ రేష్మ నానయ్య కథానాయికగా నటించగా సంజయ్ దత్ (SANJAY DUTT), రమేశ్ అరవింద్ (Ramesh Aravind), శిల్పా శెట్టి (Shilpa Shetty) కీలక పాత్రల్లో నటించారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఈ చిత్రం నిర్మించగా ప్రేమ్స్ (PREMS) దర్శకత్వం వహించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను చూస్తే వయలెన్స్ ఓ రేంజ్‌లో ఉందని తెలుస్తోండగా నరకడాలు, కత్తుల వాడకాలు గట్టిగానే ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ చేసిన నరెండు నిమిషాల 10 సెకండ్ల టీజర్ అసాంతం భారీ రక్తపాతమే దర్శణమిచ్చింది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. మీరూ ఈ టీజర్‌పై ఓ లుక్కేయండి.