Sanjay Dutt: భారీ హంగులతో ఆకట్టుకుంటుంది
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:51 AM
ధృవ సర్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కేడీ ద డెవిల్. ప్రేమ్ దర్శకత్వంలో వెంకట్‌కే నారాయణ నిర్మించా
ధృవ సర్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కేడీ ద డెవిల్’. ప్రేమ్ దర్శకత్వంలో వెంకట్‌కే నారాయణ నిర్మించారు. రీష్మా నానయ్య కథానాయిక. సంజయ్‌దత్, శిల్పాశెట్టి, నోరా ఫతేహీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సంజయ్‌దత్ మాట్లాడుతూ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూ్‌సతో గ్రాండియర్‌గా నిర్మించింది. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ధృవ నా తమ్ముడు లాంటి వారు. ఆయన చాలా గొప్పస్థాయికి ఎదగాలి. రొమాంచిత పోరాట ఘట్టాలు, భారీ హంగులతో ‘కేడీ ద డెవిల్’ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ ‘నేనెంతగానో ఇష్టపడే నటుడు సంజయ్‌దత్. ఆయనతో కలసి పనిచేయడం సంతోషాన్నిచ్చింది. శిల్పాశెట్టిగారి దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నాను. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని చెప్పారు. ‘సాహస వీరుడు సాగర కన్య’ చిత్రం చేసినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు నాపై అదే ప్రేమను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. సంజయ్‌దత్ గారితో నేను చేసిన ప్రతిసినిమా హిట్టయింది. ఈ చిత్రం కూడా తప్పకుండా ఘన విజయం అందుకుంటుంది’ అని ఆకాంక్షించారు. ‘నేను దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘జోగి’ని తెలుగులో ‘యోగి’గా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘కేడీ ద డెవిల్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని ప్రేమ్ చెప్పారు.