Karthi: రాజమౌళిని.. బయోపిక్ తీయమంటున్న రిచ్ కిడ్
ABN , Publish Date - Dec 03 , 2025 | 07:21 PM
కార్తీ తాజా చిత్రం 'వా వాతియార్' తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో డబ్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
తమిళ హీరో కార్తి (Karthi) నటిస్తున్న 'వా వాతియార్' (Va Vaathiyaar) మూవీ తెలుగులో 'అన్నగారు వస్తారు' (Annagaru Vostaru) పేరుతో డబ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా డిసెంబర్ 12న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ సాంగ్ ను బుధవారం విడుదల చేశారు. కె.ఇ. జ్ఞానవేల్ రాజా (K.E. Gnanavel Raja) నిర్మిస్తున్న ఈ సినిమాను నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తున్నాడు. కృతిశెట్టి (Krithi Shetty) ఇందులో హీరోయిన్.
బుధవారం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో పాటు 'అన్నగారు...' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చగా, రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఎస్.పి. అభిషేక్, హరిప్రియ ఈ పాటను పాడారు. 'అన్నగారు... అన్నగారు... ఆల్రెడీ నే రిచ్ కిడ్డు, పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశా, రాజమౌళికి ఫోన్ చేసి నా మీద బయోపిక్ ఒకటి తీయమంటున్న' అంటూ ఈ పాట సాగింది. కలర్ ఫుల్ మేకింగ్ తో సరదాగా సాగిన ఈ పాటను అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు పోషించారు.