Karthi: మళయాళ డైరెక్టర్ తో కార్తి
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:41 PM
కోలీవుడ్ హీరో ఖతర్నాక్ లైనప్‌ను సెట్ చేస్తున్నాడు. క్రేజీ ప్రాజెక్టులను చేతిలో పెట్టుకుంటున్నాడు. ఆల్రెడీ హైప్ ఉన్న ప్రాజెక్టులతో ఉన్న ఆ హీరో.. ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాను ఓకే చేశాడు. దీంతో ఆ కాంబో కోసం కూడా ఆడియెన్స్ వెయిటింగ్ మొదలుపెట్టేశారు.
వైవిధ్యమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న హీరో కార్తి (Karthi ). కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోనూ మంచి స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అందుకే మాగ్జిమమ్ రెండు భాషలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం కార్తీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవలే 'హిట్ థర్డ్ కేసు' (HIT: The Third Case) లో మెరిసిన కార్తి, HIT ఫ్రాంచైజీ నాల్గవ భాగంలో హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు 'సర్దార్' (Sardar )కు సీక్వెల్‌గా 'సర్దార్ 2' (Sardar 2) చేయబోతున్నాడు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం... కార్తి మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి (Tharun Moorthy)తో కొత్త చిత్రం కోసం చేతులు కలిపే అవకాశం ఉంది. తరుణ్ మూర్తి మలయాళంలో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు . ఇటీవలే మోహన్‌లాల్ (Mohanlal) తో 'తుడురుమ్' (Thudarum) సినిమా చేయగా.. రికార్డు స్థాయి వసూళ్లు అందుకుని సంచలనం సృష్టించింది. అంతకు ముందు 'సౌదీ వెళ్లక్క' (Saudi Vellakka) , 'ఆపరేషన్ జావా' (Operation Java) వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో కార్తీతో చేయబోయే సినిమాపై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.
సర్దార్ 2, హిట్ ఫోర్త్ కేసు తర్వాత కార్తీ ఈ సినిమాలోనే నటించే అవకాశముందని అంటున్నారు. ఈ సినిమాను లార్క్ స్టూడియోస్ నిర్మించనుందని తెలుస్తోంది. మరోవైపు కార్తి ఇంకా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. 'ఖైదీ 2' సీక్వెల్ కూడా పెండింగ్‌లోనే ఉంది. అవన్నీ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కార్తి లైనప్ మాత్రం అదిరిపోతోందని చెప్పుకుంటున్నారు.
Read Also: 71st National Film Awards: ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి
Read Also: August Movies: సినిమాలే సినిమాలు.. ఆ రెండింటి మీదనే అందరి గురి