Karthi: ఇంకోసారి అదే పాత్రలో...

ABN, Publish Date - May 02 , 2025 | 01:31 PM

కార్తీకి ఊహించని విధంగా ఖాకీ పాత్రలు వస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రెండు సినిమాల్లో కార్తీ పోలీస్ అధికారిగా నటిస్తుండగా ఇప్పుడు జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది.

తమిళ హీరో కార్తీ (Karthi) 'హిట్ -3' (Hit -3) చివరిలో ఖాకీ దుస్తుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఏసీపీ వీరప్పన్ పాత్రలో మెరుపులా మెరిశాడు. సో... 'హిట్' ఫోర్త్ కేసును డీల్ చేసేది కార్తీనే అనే విషయం అందరికీ అర్థమైపోయింది. హిట్ ఫోర్త్ కేసును సాల్వ్ చేసేది కార్తీ అనే విషయాన్ని వీలైనంత వరకూ గోప్యంగా ఉంచాలని దర్శకుడు శైలేష్ కొలను భావించాడు. అయితే... ఈ సినిమాలో కార్తీ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడనేది సినిమా రిలీజ్ కు ముందే తెలిసి పోయింది. కాకపోతే... 'హిట్ -4' (Hit -4)లో అతనే హీరో అనేది మాత్రం బయటకు రాలేదు. ఇదిలా ఉంటే... 'హిట్ -4'ను నిర్మాతలు నాని (Nani), ప్రశాంతి తిపిర్నేని తెలుగు, తమిళ భాషల్లో తీయబోతున్నారు. 'హిట్ -3'ని విడుదల చేసినట్టుగా పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే... ఎప్పుడైతే కార్తీ 'హిట్ -4'లో హీరో అనే విషయం రూఢీ అయ్యిందో... అప్పుడే అతను వరుసగా పోలీస్ ఆఫీసర్ పాత్రలే చేస్తున్నాడనే స్పృహ అభిమానులకు కలిగింది. ఆ మధ్య 'సర్దార్' (Sardar) మూవీలోనూ, దానికి ముందు 'ఖాకీ' (Khaki) లోనూ కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలను చేశాడు. దాని కంటే ముందు 'విక్రమార్కుడు' తమిళ రీమేక్ లోనూ కార్తీ చేశాడు. కాకపోతే... ఇప్పుడు మాత్రం వరుసగా ఖాకీ చిత్రాలే బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నారు. కార్తీ నటించిన 'వా వాథియార్' విడుదలకు సిద్థమౌతోంది. ఇందులో కార్తీ పోలీస్ పాత్రనే పోషించాడు. అలానే 'సర్దార్ -2' సీక్వెల్ లోనూ కార్తీ పోలీస్ ఆఫీసర్ విజయ్ ప్రకాశ్‌ గా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చే 'హిట్ -4'లోనూ అతను ఎసీపీ గా కనువిందు చేయబోతున్నాడు. ఈ సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే... కార్తీని మరిన్ని పోలీస్ ఆఫీసర్ పాత్రలు వరించడం ఖాయం.

Also Read: Shahrukh khan : హాలీవుడ్ స్టార్స్ కంటే ముందు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 02 , 2025 | 01:31 PM