Rishab Shetty: కాంతార ప్రీక్వెల్‌ సిద్ధం

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:23 AM

కన్నడ నటుడు రిషభ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతారా చాప్టర్‌ 1. గతంలో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది.

కన్నడ నటుడు రిషభ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతారా చాప్టర్‌-1’. గతంలో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. సోమవారం రిషభ్‌ శెట్టి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ని విడుదల చేసింది. ‘ఇతిహాసాలు పుట్టిన చోట గర్జనలు ప్రతిధ్వనిస్తాయి. ‘కాంతార’తో లక్షలాది మందిని కదిలించిన కళాఖండానికి ప్రీక్వెల్‌గా ఇది రానుంది. ఈ గొప్ప చిత్రం వెనుక ఉన్న మార్గర్శక శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అక్టోబరు 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణానికి నాంది. హృదయాన్ని కదిలించే కథకు తిరిగి మరోసారి స్వాగతం’ అంటూ చిత్రబృందం పోస్టర్‌ కింద రాసుకొచ్చింది.

Updated Date - Jul 08 , 2025 | 04:23 AM