Kantara Chapter1: నో చేంజ్.. చెప్పిన తేదీకే థియేటర్లకు
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:08 AM
రిషబ్ శెట్టి హీరోగా బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార చాఫ్టర్ ది లెజండ్ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
మూడేళ్ళ క్రితం 2022లో వచ్చిన 'కాంతార' (Kanthara) సినిమా కన్నడ చిత్రసీమను గర్వపడేలా చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కన్నడ సినిమాకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. దశల వారీగా వివిధ భాషల్లో డబ్ అయ్యి అఖండ విజయాన్ని అందుకుని ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (Rishab Shetty) కి జాతీయ పురస్కారాన్ని అందించింది. 'కాంతార' సినిమా కూడా బెస్ట్ మూవీగా ఎంపికైంది కూడా.
కాగా ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రూపొందిస్తున్నవిషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులు అనేక అవాంతరాలను ఎదుర్కోంది. గాక మూవీ బృందంలో వరుసబెట్టి నలుగు ఐదుగురు చనిపోవడంతో ఈ చిత్రం ముందు పడుతుందా లేదా అనే సందిగ్ధంలో తేలియాడుతుండగా తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
సినిమాను ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే అక్టోబర్2 గాంధీ జయంతి రోజునే విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ సోమవారం ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'కాంతార'లో భూత కోలా సంప్రదాయాన్ని, ప్రకృతితో సంఘర్షించకుండా నేచర్ ఫ్రెండ్లీగా ఉండాలని కాంతారలో చూపించారు.
అయితే ఈ ప్రీక్వెల్ కాంతార ఛాప్టర్1లో (Kantara Chapter 1) కదంబ రాజవంశంకు చెందిన ఆసక్తికరమైన కథను రిషబ్ శెట్టి తెరెక్కిస్తుండగా రిషబ్ నాగ సాధువుగా నటిస్తున్నాడని, అతీంద్రియ శక్తులను మానవ కళ్యాణం కోసం ఉపయోగించే వ్యక్తిగా తెర మీద కనిపించనున్నట్లు సమాచారం.