Accident: రోడ్డు ప్రమాదం.. ప్ర‌ముఖ‌ డాన్సర్ మృతి! కొత్త కారు.. సోదరుడికి చూపించి వస్తుండగా ఘ‌ట‌న‌

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:38 PM

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ రియాల్టీ షో డాన్సర్ సుధీంద్ర (36) దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.

Sudheendra

బెంగళూరు (Bengaluru)లో మంగ‌ళ‌వారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ రియాల్టీ షో డాన్సర్ సుధీంద్ర (36) (Sudheendra) దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా కొనుగోలు చేసిన కారును తన సోదరుడికి చూపించి తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నేషనల్ హైవేపై కారులో వెలుతున్న సుదీంధ్ర కారులో ఏదో స‌మ‌స్య ఉంద‌ని వాహనాన్ని పక్కకు ఆపి పరిశీలిస్తున్నాడు. స‌రిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు అతడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సుధీంద్రను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ప్ర‌మాదంకు సంబంధించిన దృశ్యాల‌ను సీసీటీవీ కెమెరాలో రికార్డు అవ‌గా సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అయ్యాయి. ట్రక్కు డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫుటేజీ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించి అరెస్టు చేశారు.

ఈ ఘటనపై కన్నడ సినీ మరియు డాన్స్ రంగం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సుధీంద్ర మృతిపై సంతాపం తెలిపింది. భవిష్యత్తులో పెద్దస్థాయికి ఎదగగల ప్రతిభావంతుడిని కోల్పోయామని పలువురు వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 05 , 2025 | 12:48 PM