Rukmini Vasanth: అన్ని భాషల్లో భావోద్వేగాలు పలికించే ఛాన్స్ కోసం చూస్తున్నా..
ABN , Publish Date - Dec 15 , 2025 | 10:18 AM
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్. అటు కన్నడ చిత్రాలతోపాటు ఇటు తెలుగులోనూ అవకాశాలు అందుకుంటోంది.
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్. అటు కన్నడ చిత్రాలతోపాటు ఇటు తెలుగులోనూ అవకాశాలు అందుకుంటోంది. సప్త స్వరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ కాంతార -2 చిత్రంతో మరింత దగ్గరైంది. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా పలకరించడానికి సిద్ధమైందని సమాచారం.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె హిందీలో మాట్లాడింది. ‘హిందీ నాకు చిన్నప్పటి నుంచి సుపరిచితమైన భాష. బాలీవుడ్ సినిమాలంటే ఇష్టం. చాలా ఆసక్తిగా చూస్తాను. దానికి మాది ఆర్మీ నేపథ్యమున్న కుటుంబం కావడం అనుకుంటాను. అయితే అన్ని భాషల్లోనూ భావోద్వేగాలు పండించే అవకాశం ఇంకా రాలేదు. దాని కోసం ఎదురుచూస్తున్నా. దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దేవుడి దయతో త్వరలోనే ఆ పనిని ప్రారంభిస్తానని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.

ఆమె మాటలను బట్టి హిందీ చిత్రాల చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అవకాశం అందుకునే ఛాన్స్‌చచ ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల కాంతార ఛాప్టర్-1తో ఆకట్టుకున్న రుక్మిణి ప్రస్తుతం తెలుగులో తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది.