Thalaivar 173: రజినీ డైరెక్టర్ కి రూ. 10 కోట్లు.. మాములు విషయం కాదుగా
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:05 PM
కోలీవుడ్ లో తలైవర్ 173(Thalaivar173) సినిమా షాక్ ల మీద షాకులు ఇస్తుంది. రజినీకాంత్ (Rajinikanth) హీరోగా కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తున్న సినిమా కావడంతో మొదలుపెట్టకుండానే అభిమానులు అంచనాలను పెంచేసుకున్నారు.
Thalaivar 173: కోలీవుడ్ లో తలైవర్ 173(Thalaivar173) సినిమా షాక్ ల మీద షాకులు ఇస్తుంది. రజినీకాంత్ (Rajinikanth) హీరోగా కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తున్న సినిమా కావడంతో మొదలుపెట్టకుండానే అభిమానులు అంచనాలను పెంచేసుకున్నారు. మొదట సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు అని అధికారికంగా ప్రకటించారు. కానీ, రెండు రోజులకే సినిమా నుంచి తప్పుకున్నాడు అని చెప్పారు. సరే సుందర్ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారు అంటే.. స్టార్ డైరెక్టర్స్, కుర్ర డైరెక్టర్స్ అందరూ బిజీ.
అరెరే రజినీకి ఒక్క డైరెక్టర్ కూడా దొరకలేదా.. ? అనుకుంటున్న సమయంలో నేనున్నా తలైవా అంటూ రామ్ కుమార్ బాలకృష్ణన్ ప్రత్యేక్షమయ్యాడు. తీసింది ఒక్క సినిమానే అయినా కూడా నేషనల్ అవార్డు అందుకునేలా తీయడం గొప్ప విషయం. పార్కింగ్ సినిమాతో రామ్ కుమార్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా హిట్ తరువాత డైరెక్ట్ గా శింబుతో సినిమా పట్టేశాడు. అంతేనా రెమ్యూనరేషన్ కూడా డబుల్ అయ్యింది.
పార్కింగ్ సినిమాకు రామ్ కుమార్ కేవలం రూ.6 లక్షలు మాత్రమే అందుకున్నాడు. శింబు సినిమాకు రూ. 2 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే మనోడి పంట పండి.. రజినీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక కథ కూడా నచ్చడంతో కమల్ ముచ్చటపడి.. రజినీ కోసం ఏకంగా రూ. 10 కోట్లు పారితోషికం ఫైనల్ చేసాడట. ప్రస్తుతానికి ఇదే కోలీవుడ్ లో హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఇందులో నిజమెంత అనేది తెలియకపోవొచ్చు. కానీ, ఇదే నిజమైతే రెండేళ్లలో 6 లక్షల నుంచి 10 కోట్లు అందుకుంటున్న డైరెక్టర్ గా రామ్ కుమార్ కి ఒక రికార్డ్ వస్తుంది అని చెప్పొచ్చు. త్వరలోనే కమల్ తలైవర్ 173 గురించి అధికారిక ప్రకటన ఇస్తాడేమో చూడాలి.