Kamal Haasan: సైనికులు పోరాడుతున్న వేళ.. వేడుకలకు సమయం కాదు
ABN , Publish Date - May 09 , 2025 | 04:31 PM
ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆడియో రిలీజ్‌ను క్యాన్సిల్ చేసింది. త్వరలోనే కొత్త ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపింది.
కమల్‌హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life). జూన్ లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల విడుదల కానుంది. ఈ నెలలో భారీస్థాయిలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని టీమ్ భావించింది. ఈవెంట్ కోసం మే 16న డేట్ ఫిక్స్ చేశారు. కానీ, ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆడియో రిలీజ్‌ను క్యాన్సిల్ చేసింది. త్వరలోనే కొత్త ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపింది.
‘‘బోర్డర్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ నెల 16న జరగనున్న ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్‌ను వాయిదా వేయాలని మేము భావిస్తున్నాం. మన మాతృభూమి పరిరక్షణలో సైనికులు ఎంతగానో పోరాడుతోన్న వేళ ఇది వేడుకలకు సమయం కాదు. సైనికులకు మా మద్దతు తెలియజేస్తున్నాం. దేశ పౌరులుగా మా బాధ్యత ఇది’’ అని కమల్‌హాసన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాయకన్’ లాంటి హిట్ తర్వాత కమల్ - మణిరత్నం కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. జూన్ 5న ఈ సినిమా విడుదల కానుంది.