Kamal Haasan: తలైవర్ 173.. నా హీరో సంతృప్తి చెందాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:02 PM

స్తుతం కోలీవుడ్ ను కుదిపేస్తున్న విషయాల్లో తలైవర్ 173 (Thalaivar 173) నుంచి సుందర్ సి (Sundar C)ఎందుకు తప్పుకున్నాడు అనేది కూడా ఒకటి అని చెప్పొచ్చు.

Kamal Haasan

Kamal Haasan: ప్రస్తుతం కోలీవుడ్ ను కుదిపేస్తున్న విషయాల్లో తలైవర్ 173 (Thalaivar 173) నుంచి సుందర్ సి (Sundar C)ఎందుకు తప్పుకున్నాడు అనేది కూడా ఒకటి అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా కమల్ హాసన్ (Kamal Haasan) బ్యానర్ లో డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న చిత్రం తలైవర్ 173. ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ ను కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించాడు. సుందర్ సి సైతం ఇది తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. అయితే వారం రోజులు కూడా తిరక్కముందే సుందర్.. ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఇక సుందర్ సి తప్పుకోవడం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ, స్క్రిప్ట్ లైన్ విని ఓకే చేసిన రజినీ.. పూర్తి కథను విన్నాక సంతృప్తి చెందలేదని అందుకే సుందర్ సి సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయమై కమల్ హాసన్ స్పందించాడు. రజినీకి స్క్రిప్ట్ నచ్చలేదు.. అందుకే సుందర్ తప్పుకున్నాడు అనే కారణమే నిజమని కమల్ సైతం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం తలైవర్ 173 కి మంచి డైరెక్టర్ ను వెతుకుతున్నట్లు తెలిపాడు.

'సుందర్ సి.. తలైవర్ 173 నుంచి ఎందుకు తప్పుకున్నాడో ఆయన ప్రకటనలో క్లారిటీగా చెప్పాడు. ఇంకా నేను చెప్పడానికి ఏమి లేదు. నేను ఒక నిర్మాతను.. నా హీరోను సంతృప్తి పరిచే కథను తీసుకురావడం నా బాధ్యత. ఆయనను సంతృప్తిపరిచేవరకు స్క్రిప్ట్స్ వింటూనే ఉంటాము. ఇక మేము కలిసి చేయబోతున్న మల్టీస్టారర్ కోసం కూడా డైరెక్టర్ ను వెతుకుతున్నాము' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కమల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Nov 15 , 2025 | 04:05 PM