3BHK: కలలన్నీ లిరికల్ వీడియో సాంగ్.. సిద్ధార్థ్‌కు హిట్ గ్యారంటీ!
ABN , Publish Date - May 24 , 2025 | 07:33 PM
సిద్ధార్థ్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం 3BHK.
సిద్ధార్థ్ (Siddharth), శరత్ కుమార్ (SarathKumar) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం 3BHK. గత సంవత్సరం శివకార్తికేయన్‌తో మావీరన్‌తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత అరుణ్ తన తదుపరి చిత్రంగా విశ్వ శాంతి టాకీస్‌పై తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ మిస్కిన్ అసిస్టెంట్ శ్రీగణేష్ (Sri Ganesh) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవయాని (Devayani), మీతా రఘునాథ్ (Meetha Raghunath), చైత్ర ఆచార్ (Chaithra J. Achar), యోగి బాబు (Yogi Babu) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై4న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను దక్కించుకోగా తాజాగా కలలన్నీ అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నటుడు, రచయుత రాకేందు మౌళి (RakenduMouli) ఈ పాటకు సాహిత్యం అందించగా హేమచంద్ర (Hemachandra Vedala), గోపికా పూర్ణిమ (Gopika Poornima), సాహితి చాగంటి (Sahithi Chaganthi), PVNS రోహిత్ (PVNS Rohit) ఆలపించారు. అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందించారు.
కాగా ఈపాట వినంటున్నంత సేపు ఎంత ఆహ్లాదంగా ఉందో.. విజువల్‌గా కూడా అంతే అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు మేకర్స్ చేసిన ప్రచారానికి భిన్నంగా ఇందులో సినిమా పాట సాగే ఇంట్లోనే సింగర్స్ ఆ ఇల్లు అంత కలియ తిరుగుతూ పాట పాడుతున్నట్లుగా చిత్రీకరించారు.ఇప్పుడు ఈ పాట యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలోనూ బాగా వైరల్ అవుతుంది. మీరు ఇంతవరకు గమనించకున్నా, చూడకున్నా, ఇప్పుడే ఆ పాటను చూసి ఆ కొత్తదనాన్ని మీరూ ఆస్వాదించండి.