Kaali Venkat: ఈ విజయం.. మా నాన్నకు అంకితం
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:52 PM
మద్రాస్ మ్యాట్నీ చిత్రం విజయం తన తండ్రికి అంకింతమిస్తున్నట్టు నటుడు కాళి వెంకట్ అన్నారు.
మద్రాస్ మ్యాట్నీ(Madras Matinee) చిత్రం విజయం తన తండ్రికి అంకింతమిస్తున్నట్టు నటుడు కాళి వెంకట్ (Kaali Venkat) అన్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj), కాళి వెంకట్ (Kaali Venkat), షెల్లీ, రోషిణి హరిప్రియన్ (Roshini Haripriyan,), విశ్వ జార్జ్, మరియన్, అర్చన సందూక్, తదితరులు నటించిన ‘మద్రాస్ మ్యాట్నీ’ సినిమా ఈ నెల 6వ తేదీ విడుదలకాగా, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
మద్రాస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత, స్వీయ దర్శకత్వంలో కార్తికేయన్ మణి (Karthikeyan Mani) నిర్మించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు భారీ వసూళ్ళను రాబట్టింది. దీనిని పురస్కరించుకుని చిత్ర బృందం నగరంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో నటుడు లొల్లు సభ స్వామినాథన్, సంగీత దర్శకుడు కేసీ బాల సారంగన్, నటుడు విశ్వ, నటి రోషిణి, హరిప్రియన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థకు చెందిన గుహన్ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ, ‘ తొలిసారి తాను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయాన్ని చేకూర్చిపెట్టిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. హీరో కాళి వెంకట్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాను ఇంతటి ఘన విజయం చేకూర్చిపెట్టిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా స్టోరీని దర్శక నిర్మాత వివరించినపుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు. అందుకే ఈ చిత్ర విజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను’ అని పేర్కొన్నారు.