JSK Movie: అనుపమ సినిమా.. మోహన్‌లాల్‌ను నిందించారు..
ABN , Publish Date - Jul 07 , 2025 | 09:26 PM
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. సెన్సార్ సమస్యతో ఈ సినిమాలకు ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే!
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి (Suresh Gopi), మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki Vs stare of kerala). సెన్సార్ సమస్యతో ఈ సినిమాలకు ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఈ విషయంలో మాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ వివాదం గురించి తాజాగా నిర్మాత సురేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘ఎల్ 2: ఎంపురాన్’ చిత్రాన్ని నిందించారు. ఆ సినిమా నుంచే పరిస్థితులు ఇలా మారాయని ఆయన అన్నారు. ఈ సమస్యలు అన్నింటికీ ‘ఎల్ 2: ఎంపురాన్’ సినిమానే అని ఆరోపించారు. ‘‘ఎంపురాన్’ సినిమా విడుదల సమయంలో పలు వివాదాలు తెరపైకి వచ్చాయి. దీంతో సెన్సార్ బోర్డ్ దానిని మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చింది. అక్కడే అసలైన సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతి సినిమా విషయంలో సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది. ఎన్నో సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. దాని వల్లే ఈ సమస్య. ప్రస్తుతం ఈ టైటిల్ వివాదం న్యాయస్థానంలో ఉంది. టైటిల్‌లో జానకి అనే పేరు కొనసాగించవచ్చా? లేదా? అనేది న్యాయస్థానం నిర్ణయించనుంది. సరైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నా’’ అని నిర్మాత జె.ఫణీంద్రకుమార్ అన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
థ్రిల్లర్ కథాంశంతో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా తెరకెక్కింది. సత్యం ఎప్పటికైౖనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగే ఈ సినిమాకు సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరు జానకి కావడం, సినిమాలో దాడికి గురైన మహిళా పాత్రకు ఆ పేరు పెట్టడం సమంజసం కాదని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి తెలిపింది. సినిమా పేరు మార్చాలని కోరింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9న కోర్టు వాదనలు విననుంది. ప్రవీణ్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో జానకిగా అనుపమ కనిపించనున్నారు. లాయర్‌గా సురేశ్ గోపి నటించారు.