Jayam Ravi: జయం రవి వివాదంలోకి దిగిన అత్త..
ABN, Publish Date - May 17 , 2025 | 08:33 PM
ప్రస్తుతం జయం రవి (jayam Ravi) - ఆర్తి రవి (Aarti Ravi), సింగర్ కెనీషా (Kenisha) గురించే ఎక్కడ చూసినా టాపిక్. ఈ కుటుంబ వివాదం రోజురోజుకీ పెద్దదవుతోంది. తాజాగా ఈ వివాదంలోకి మరో వ్యక్తి చేరారు.
ప్రస్తుతం జయం రవి (jayam Ravi) - ఆర్తి రవి (Aarti Ravi), సింగర్ కెనీషా (Kenisha) గురించే ఎక్కడ చూసినా టాపిక్. ఈ కుటుంబ వివాదం రోజురోజుకీ పెద్దదవుతోంది. తాజాగా ఈ వివాదంలోకి మరో వ్యక్తి చేరారు. ఆయన తీరును తప్పుపడుతూ తాజాగా ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘రవి వల్లే సినీ నిర్మాణం లోకి అడుగుపెట్టాను. అతడిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూశాను. నిర్మాతగా అప్పుల పాలయ్యాను. అతనికి ఈ విషయం తెలిసినప్పటికీ ఏ మాత్రం సాయం చేయలేదు. ఇప్పుడు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నాడు. రవి ఎన్నో అబద్థాలు చెబుతున్నారు. ఆయన చేసే వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. తను ప్రోత్సహించడం వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా ‘అడంగ మరు’, ‘సైరన్’ చిత్రాలను నిర్మించా. ఆ సినిమాల్లో తానే హీరోగా వర్క్ చేశాడు. ఈ సినిమాల కోసం ఫైనాన్షియర్ల నుంచి రూ.100 కోట్లు అప్పు తీసుకున్నా. అందులో 25 శాతం తనకే పారితోషికంగా ఇచ్చా. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ నాతో ఉన్నాయి. తనని నేను ఎప్పుడూ ఒక అల్లుడిలా చూడలేదు. కొడుకుగా భావించా. అతను ఎప్పుడూ బాధ పడకూడదనుకున్నా. అప్పుల వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను.. నేను ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని. నష్టాల నుంచి బయట పడేయడానికి నా బ్యానర్‌లో మరో సినిమా చేస్తానని ‘సైరన్’ సమయంలో మాటిచ్చాడు. కానీ, ఏ చిత్రానికి సంతకం చేయలేదు. అంతేకాకుండా, అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు. తను నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచేవాడు. ఒక అమ్మగా ఈరోజు నేను కోరుకునేది ఒక్కటే.. తనని ఇంతకాలం ఒక హీరోగా చూశా. కానీ, సానుభూతి పొందడం కోసం ఇప్పుడు అతడు చేసే ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉంది. హీరో అనే భావన పోతోంది. అతను ఎప్పుడూ ఒక హీరోగానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు.