Kiki And Koko: థియేటర్లకు.. మరో ఇండియన్ యానిమేషన్ ఫిల్మ్
ABN , Publish Date - Nov 19 , 2025 | 06:07 AM
దర్శకుడు పి. నారాయణన్ రూపొందించిన యానిమేషన్ ఫిల్మ్ ‘కికీ అండ్ కోకో’ పిల్లలు, పెద్దలకు ఆకట్టుకునే స్నేహం–భావోద్వేగాల కథగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో యానిమేషన్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఆ తరహా చిత్రాలు తీయడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య తక్కువే. అది దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకట్టుకొనే రీతిలో ‘కికీ అండ్ కోకో’ (Kiki And Koko) పేరుతో ఓ యానిమేషన్ ఫిల్మ్ రూపొందించారు దర్శకుడు పి.నారాయణన్ (PNarayanan).
దీని గురించి ఆయన వివరిస్తూ ‘కికీ అనే పెంపుడు జంతువుకీ, కోకో అనే చిన్నారికి మధ్య ఉన్న అపూర్వమైన బంధాన్ని చెప్పే సినిమా ఇది. యానిమేషన్ రంగంలోకి అడుగుపెడుతూ మేం చేసిన తొలి ప్రయత్నం ఇది. కేవలం హాలీవుడ్ వారు మాత్రమే ఇలాంటి చిత్రాలు తీయగలరు అనుకునే వారికి మేం విజువల్‌గా చెప్పే సమాధానం ‘కికీ అండ్ కోకో’ అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ జీఎం కార్తికేయన్ (GM Karthikeyan) మాట్లాడుతూ ‘ఇది కేవలం సినిమా మాత్రమే కాదు స్నేహం, ప్రేమ, కథల ద్వారా పిల్లలు నేర్చుకునే విలువైన పాఠాల వేదిక. త్వరలోనే మీ ముందుకు రాబోతోంది’ అని చెప్పారు.